విజయ్ దేవరకొండతో “అర్జున్ రెడ్డి” సినిమాను తెరకెక్కించి టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిన సందీప్ రెడ్డి వంగాను తన ఇంటికి పిలిపించి మరీ అభినందించిన ప్రిన్స్ మహేష్ బాబు, ఆ దర్శకుడికి ‘ఓపెన్ ఆఫర్’ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ రెడ్డి చెప్పగా, మహేష్ కున్న కమిట్మెంట్స్ రీత్యా, ఇప్పట్లో ఈ కాంభినేషన్ కార్యరూపం సిద్ధించుకునే అవకాశాలు లేవని ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే వారందరికీ షాక్ ఇచ్చే విధంగా ప్రిన్స్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ కమిట్ అయిన కొరటాల శివ, వంశీ పైడిపల్లిల సినిమాలు ముగియగానే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడితో ఓ సినిమాను చేయాలని ఫిక్స్ అయినట్లుగా టాక్. ‘శ్రీమంతుడు’ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. నిజానికి మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాకు ప్లాన్ జరుగగా, త్రివిక్రమ్ స్థానంలో సందీప్ రెడ్డి వచ్చి చేరడం ఊహించని పరిణామం. ఈ సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేయమని ప్రిన్స్ సూచనలు చేసారట.


