ట్రోలింగ్ : ‘సాక్షి’ జర్నలిజంకు నిదర్శన!

Mahesh Babu Brother Ramesh babu death‘సృజనాత్మకత’కు కూడా ఓ అర్ధం పరమార్ధం ఉంటేనే దానికి సరైన గుర్తింపు లభిస్తుంది. పెళ్లింట సరదా చావు ఇంట విషాదం అలుముకుని ఉంటాయి. ఈ రెండింటికి తేడా తెలియకపోతే ‘క్రియేటివిటీ’ కాస్త ‘కామెడీ’ అయిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే… ఘట్టమనేని ఇంట జరిగిన విషాదాన్ని సాక్షి టీవీ మరో కోణంలో చూపించడం వలన!

‘రమేష్ బాబు చివరి చూపుకు మహేష్ బాబు ఎందుకు రాలేదు’ అంటూ యూట్యూబ్ లో సాక్షి ‘థంబ్ నైల్’ పెట్టడం మహేష్ అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతోంది. అసలే అన్న తనను వదిలేసిన బాధలో ఉన్న మహేష్ ను ఇలాంటి హెడ్డింగ్స్ తో ఇబ్బంది పెట్టడం ఏమిటో అర్ధం కాక నెటిజన్లు సాక్షి టీవీపై మండిపడుతున్నారు.

ADVERTISEMENT

కనీస నైతికత కూడా సాక్షి దగ్గర కొరవడిందనేది మహేష్ అభిమానుల సారాంశం. మహేష్ కు కరోనా వచ్చిందని, దాని వలన అన్నయ్యను చివరిసారిగా చూడలేకపోతున్నారనేది ప్రపంచమంతా తెలిసిన విషయం. దీనిపైన కూడా తన రెగ్యులర్ రాజకీయాల మాదిరి ప్రేక్షకులను పక్కదారి పట్టించడం అనేది జీర్ణించుకోలేని అంశంగా మారింది.

ఇలాంటి జర్నలిజం ఏ భావదారిద్రానికి సూచికో అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ట్రోలింగ్ లో విశేషం ఏమిటంటే… ఒక్క మహేష్ అభిమానులే కాదు, కామన్ సెన్స్ తో కూడిన ఇతర హీరోల అభిమానులు, నెటిజన్లు కూడా పాలుపంచుకుంటున్నారు. సాక్షి జర్నలిజం ఏమిటో మరోసారి నిరూపణ అవుతుందనేది చివరి మాట.

mahesh babu ramesh babu

ADVERTISEMENT
Latest Stories