పవన్ కళ్యాణ్ అభిమానులు – మహేష్ కత్తి మధ్య పోరాటం కొనసాగుతోంది. రాజ్యాంగం కల్పించిన తన ప్రాధమిక హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పిన మహేష్ కత్తి, ఎట్టకేలకు తాను ప్రశాంతంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. న్యాయం కోసం చట్టం తలుపు తట్టడానికి సిద్ధమయ్యానని చెప్పిన మహేష్ కత్తి, తన మూడ్ మారిందని చెప్పాడు. అయితే తనకు కాల్స్ వస్తున్నంత వరకు తన పోరాటం ఆగేది లేదని, ఈ సమస్య గురించి మాట్లాడుతూనే ఉంటానని స్పష్టత ఇచ్చారు.
ఇది పబ్లిసిటీ అనుకుంటే అది మీ అభిమతానికే వదిలేస్తా. జరుగుతున్న నష్టం నాకు, ఆ నొప్పి, బాధ నావి. నాకు ఉచిత సలహాలు ఇచ్చే బదులు పవన్ ఫ్యాన్స్ ను ఆగమనో, పవన్ కళ్యాణ్ ను ఆగమనో ఎందుకు చెప్పరు? అంటూ తనకు సలహాలు ఇచ్చేవారిని కూడా ప్రశ్నించారు. ఒకవేళ వాళ్ళు మీ మీద కూడా దాడి చేస్తారని భయమా? అయితే నా పోరాటం మాత్రం ఆపను, మీకు చిరాకు అనిపిస్తే దయచేసి నన్ను బ్లాక్ చేసేయ్యండి… అంటూ ఫేస్ బుక్ వేదికగా తన భావాలను వ్యక్తపరిచారు.
పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళినపుడు తానూ ఓ వీడియోను చూశానని, తనకు మద్దతు తెలిపిన జమీల పట్టాన్ గారు ఒకరని, సదరు వీడియోను పోస్ట్ చేసారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి పిలుపునిస్తున్న వాళ్ళల్లో ఈమె ఒకరని, ఇందుకు ధన్యవాదాలు తెలిపారు మహేష్ కత్తి. వ్యక్తిగతంగా మహేష్ కత్తిపై కక్ష్య కట్టే బదులు, అభిమానులంతా తమ చుట్టూ ఉన్న సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళండి, ఇలాగే అనేక సమస్యలు ఉన్నాయి, వాటిపై రియాక్ట్ అవ్వండి… అంటూ పవన్ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు ఈమె.


