నా ‘ఐ ఫోన్ 7 ప్లస్’ వచ్చేసింది – సెలబ్రిటీ ఆనందం!

manchu-lakshmi-iphone-7మార్కెట్ లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎందుకు అంతగా ఆదరణ పొందుతున్నాయో అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇటీవలే ‘ఐ ఫోన్ 7 ప్లస్’ మార్కెట్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫోన్ కుండే క్రేజ్ తెలియనిది కాదు. ప్రపంచం నలుమూలాల విపరీతమైన ఆర్డర్ లు వచ్చిపడే ఈ ఫోన్ పట్ల సెలబ్రిటీలలో ఎంత క్రేజ్ ఉందో మంచు లక్ష్మి చెప్పకనే చెప్తోంది.

డబ్బులకు కొదవలేని కొందరి సినీ సెలబ్రిటీల జీవితాలకు ఐ ఫోన్ 7 ప్లస్ ధర పెద్దగా అనిపించకపోవచ్చు. అయితే దానిని పొందిన సమయంలో వారికి లభిస్తున్న ఆనందం మాత్రం పెద్దగానే ఉందని మంచు వారమ్మాయి ఫోటో చూస్తే తెలిసిపోతోంది. ‘నా ఐ ఫోన్ 7 ప్లస్ వచ్చేసింది… హీ…హా… అంటూ నా కంటే ఆనందంగా ఉండే వారెవరూ లేరు’ అంటూ తెగ సంబరపడిపోతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ADVERTISEMENT

ఇలాంటి సెలబ్రిటీలను చూసే సామాన్యులలోనూ ఇలాంటి ఫోన్ల పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. గతంలో ఐ ఫోన్ 6 కోసం ఓ విదేశీ మహిళ నడిరోడ్డుపైనే వివస్త్రగా మారి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే మన దేశంలో కొన్ని మర్డర్లు కూడా నమోదైన ఉదంతాలు ఉన్నాయి. మరి సెలబ్రిటీలోనే ఇంతటి క్రేజ్ ఏర్పరచుకున్న ఐ ఫోన్ 7 ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories