ఈ వారం మొదట్లో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా తిరుపతిలో మకాం వేసి రైతులకు అక్కడ పిల్లల కోసం పని చేయబోతున్నట్టు మంచు మనోజ్ ప్రకటించారు. ఆ ప్రకటనలోనే దీనిని రాజకీయంగా చూడొద్దు అని కోరారు. అయితే ఆ దిశగా చూడటం ఆగలేదు. శ్రీకాకుళంలో ఒక గ్రామాన్ని దత్తతు తీసుకుంటున్న అని రామ్ చరణ్ ప్రకటించగానే ఆయన పొగడ్తలతో ముంచెత్తారు.
[m9ad]
దీనితో ఆయన జనసేనలో చేరతారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా నారా బ్రాహ్మణి ఆడ సింహంలాంటి వారు అంటూ బాలకృష్ణ కుమార్తెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు మనోజ్. తిత్లీ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని తొమ్మిది గ్రామాలను బ్రాహ్మణి దత్తత తీసుకున్నారు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మనోజ్ ఆమెను అభినందించారు.
‘శ్రీకాకుళం కోసం నారా బ్రాహ్మణి తనవంతు సాయం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. నాకు తెలిసిన దృఢమైన మహిళల్లో ఆమె ఒకరు. అవసరంలో ఉన్నవారి కోసం సాయం చేయడానికి ముందు రావడం నిజంగా అభినందించాల్సిన విషయం. సింహం బిడ్డ ఎప్పటికీ సింహమే.. జై బాలయ్య’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
దీనితో ఆయన తెలుగు దేశం తరపున పని చేయబోతున్నారా అంటూ మరొక వర్గం అనుకుంటుంది. గతంలో మోహన్ బాబు టీడీపీలో ఉండే వారు. ఆ పార్టీ తరపున ఎంపీ కూడా అయ్యారు. కాకపోతే తరువాతి కాలంలో చంద్రబాబుతో విభేదించి రాజకీయాలకు దూరమయ్యారు. ఒక్కోసారి ఆయన వైకాపాలో జాయిన్ అవుతారనే పుకార్లు కూడా వినిపించేవి



