కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తల్లి అయిన లక్షమ్మ కాలం చేసారు. 85 ఏళ్ళ ఈమె, ప్రస్తుతం తిరుపతిలో శ్రీవిద్యానికేతన్ లో ఉంటుండగా, నేడు ఉదయం 6 గంటలకు అక్కడే తుది శ్వాస విడిచారు. మోహన్ బాబు కుటుంబం అంతా ప్రస్తుతం విదేశాల్లో ఉండగా, ఈ సమాచారం తెలుసుకుని హుటాహుటిన ఇండియాకు పయనం అయ్యారు.
[m9ad]
ADVERTISEMENT
21వ తేదీన తిరుపతిలో లక్షమ్మ అంతిమయాత్ర జరగనుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు ఇంతగా ఎదిగినా, ఎప్పుడూ ఒక సినీ వేదిక మీద గానీ, ఇతర వేడుకలలో గానీ లక్ష్మమ్మ కనిపించింది లేదు. ఒక స్టార్ హీరో తల్లిగా కంటే ఒక సాధారణ తల్లిలా తన జీవనం సాగించిన లక్ష్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం.
ADVERTISEMENT



