ఈ సినిమా రిలీజ్ అయ్యిందా!

Meda Meeda Abbayi Hoping For A Big Comebackప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సినిమాలు సందడి చేయడం షరామామూలే. అయితే ఈ శుక్రవారం నాడు విడుదలైన రెండు సినిమాలు కూడా చాలా లో బజ్ లో విడుదల కావడం విశేషం. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన “యుద్ధం శరణం” అందులో ఒకటిగా, అల్లరి నరేష్ చేసిన “మేడ మీద అబ్బాయి” సినిమా మరొకటి విడుదల కాగా, చైతూ సినిమాపై ఎంతో కొంత బజ్ ఏర్పడింది. అయినప్పటికీ ఈ సినిమా ఓపెనింగ్స్ బాగా తక్కువగా నమోదయ్యాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇదిలా ఉంటే అసలు అల్లరి నరేష్ సినిమా విడుదలైందన్న విషయమే చాలా మంది ప్రేక్షకులకు తెలియదని చెప్పడంలో సందేహం లేదు. సక్సెస్ మాట మర్చిపోయిన అల్లరోడుకు ఈ సినిమా అయినా ‘స్వీట్ న్యూస్’ను ఇస్తుందని అనుకుంటే, అందుకు విరుద్ధంగానే సినీ విశ్లేషకుల నుండి ‘ఫస్ట్ టాక్’ రావడంతో, ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యిందన్న విషయం కూడా ప్రేక్షకులకు తెలుస్తుందో… లేదో..! అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఫస్టాఫ్ వరకు సోసోగా ఉన్న ఈ సినిమా సెకండాఫ్ లో దారి తప్పినట్లుగా సినీ విశ్లేషకుల భావన.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories