మాకు బుద్దీ జ్ఞానం లేవా చొక్కాలు విప్పడానికి? మంత్రి నాగార్జున ప్రశ్న

Merugu Nagarjuna Satire On Audimulapu-Suresh-Protestప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నప్పుడు, మంత్రి ఆదిమూలపు సురేష్‌ నడిరోడ్డుపై మీడియా ఎదుటచొక్కా విప్పేసి నిరసన తెలిపారు. మంత్రి హోదాలో ఉన్న ఆయన నడిరోడ్డుపై చొక్కా విప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఆయన తన చర్యను సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు.

ADVERTISEMENT

“టిడిపి కార్యకర్తలు మీ కార్యాలయంపై రాళ్ళతో దాడి చేసి తగులబెడతారట కదా?”అని నన్ను మీడియా ప్రతినిదులు అడిగినప్పుడు “దమ్ముంటే నన్ను కూడా తగులబెట్టండని చెప్పేందుకు చొక్కా విప్పాను,” అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.

కానీ మరో మంత్రి మేరుగు నాగార్జున అందుకు పూర్తిభిన్నంగా మాట్లాడుతూ, టిడిపి కార్యకర్తలే ఆయనపై దాడి చేసి చొక్కా చించేశారని చెప్పడం విశేషం. అదీ… ఆదిమూలపు సురేష్‌ని పక్కనే పెట్టుకొని చెప్పారు!

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మంత్రి నాగార్జున సాటి మంత్రిని సమర్ధిస్తున్నట్లుగా మాట్లాడుతూనే చులకనగా మాట్లాడటం!. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “మేము పేదవారమైనప్పటికీ మాకూ బుద్దీ జ్ఞానం ఉన్నాయి కదా? మేము చదువుకొన్నాము కదా? ఆదిమూలపు సురేష్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా చేశాడు… ఆయనకి ఆ మాత్రం బుద్దీ జ్ఞానం లేవా…నడిరోడ్డుపై చొక్కా విప్పేసి అర్దనగ్న ప్రదర్శన చేయడానికి?టిడిపి కార్యకర్తలే ఆయనపై దాడి చేసి ఆయన చొక్కా చించేశారు. కానీ ఆయనే చొక్కా విప్పుకొన్నారని టిడిపి, దాని అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎదురుగా నిలబడి ఆయనపై రాళ్ళ దాడి చేయించి చొక్కా చింపించి దళితుడైన మా మంత్రిని అవమానించారు. ఇది దళితులందరిపై జరిగిన దాడిగా భావిస్తున్నాము. ఇందుకు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి,” అని అన్నారు.

మంత్రి ఆదిమూలపు సురేష్‌ తాను రోడ్డుపై చొక్కా విప్పడం వలన ఇంత రాద్ధాంతం అవుతుందని ఊహించి ఉండరు. కానీ సోషల్ మీడియాలో వైసీపీ నేతల చరిత్రని టిడిపి తవ్విపోసింది. ఓ ఎంపీ ఫ్యాంటు విప్పి వీడియోషో చేస్తారని, మరో మంత్రి గంట, ఇంకో మంత్రి అరగంట అంటూ మహిలలతో అసభ్యంగా ప్రవర్తిస్తారని, ఇప్పుడు మరోమంత్రి నడిరోడ్డుపై చొక్కా విప్పేశారంటూ విమర్శలు గుప్పిస్తూ వైసీపీలో మంత్రులు అందరూ ఇంతేనా?అంటూ సోషల్ మీడియాలో నిలదీసింది.

దీంతో వైసీపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. కానీ మంత్రి మేరుగ నాగార్జున మాటలు విన్నప్పుడు, ఆయన సాటి మంత్రి ఆదిమూలపు సురేష్‌ని వెనకేసుకు వస్తున్నారా లేక అదేదో సినిమాలో బ్రహ్మానందం కోటాశ్రీనివాసరావుని అవహేళన చేసిన్నట్లు చేశారా?అనే సందేహం కలుగుతుంది.

నేనే చొక్కా విప్పానని చెప్పిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ని పక్కనే పెట్టుకొని ఆయన చొక్కాని టిడిపి కార్యకర్తలు చించేశారని అబద్దం చెప్పి ఈ వ్యవహారాన్ని ఇంకా సాగదీశారు కూడా.

ADVERTISEMENT
Latest Stories