సీఎం గారు బీపీ… మంత్రి గారు బాధ..!

minister balineni srinivasa reddy ys jaganనాడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ వర్గం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ఇతర పార్టీ నేతలు తీవ్రంగా ఖండించి ఇలాంటి సంస్కృతి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, గతంలో ఎన్నడూ ఇలాంటివి జరిగిన దాఖలాలు కూడా లేవని అభిప్రాయపడ్డారు. కానీ వైసీపీ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు మాత్రం విమర్శలకు తావిచ్చింది.

ADVERTISEMENT

అభిమానులకు, కార్యకర్తలకు ఏదో బీపీ వచ్చి అలా చేసుంటారని చాలా తేలికగా ఈ అంశాన్ని కొట్టిపడేసారు. ఉండవల్లి లాంటి పెద్దలు సైతం ఈ ప్రకటన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ… స్వయంగా ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటన చేస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్లా? లేనట్లా? ఇంకా ప్రభుత్వం ఉన్నది దేనికి? పోలీసులు ఉన్నది దేనికి? అంటూ తీవ్రస్థాయిలోనే తన భావాలను పంచుకున్నారు.

ఈ ఉదంతం జరిగి దాదాపుగా రెండు మాసాలు గడుస్తున్నా, ఇంతవరకు పోలీసులు ఏ ఒక్కరిపై కూడా కేసులు నమోదు చేసింది లేదు, చర్యలు తీసుకుంది లేదు. దీని నుండి కోలుకున్న తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం అధికార పక్ష తీరుపై పోరాడుతోంది. సీఎం గారు వ్యక్తపరిచిన ‘బీపీ’ వ్యాఖ్యలు మళ్ళీ వెలుగులోకి వచ్చేలా వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మాటలు ఉన్నాయి.

గుంటూరు లాడ్జ్ లో ఉన్న సుబ్బారావు గుప్తాను బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరగణం చితకబాదిన వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దీనిపై స్పందించిన బాలినేని, ‘సుబ్బారావు చేసిన వ్యాఖ్యలకు బాధపడి దాడి చేయడానికి వెళ్లిన వారిని, తాను ఫోన్ చేసి అడ్డుపడ్డానని, అతను మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని’ చెప్పుకొచ్చారు.

ఈ రెండు ఉదంతాలను పోలుస్తూ టిడిపి వర్గాలు మరియు నెటిజన్లు పలు మేమ్స్ ను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. “బీపీ వస్తే ప్రత్యర్థి పార్టీ మీద దాడి చేస్తారు, అదే బాధ వస్తే సొంత పార్టీ వారి పైనే దాడి చేస్తారు” అంటూ తమదైన సైటెరికల్ పోస్ట్ లతో సందడి చేస్తున్నారు. ఏది ఏమైనా వైసీపీ నేతలు తమ మాటలతో ఏదోక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంటారు, వాటిని తెలుగు తమ్ముళ్లు ట్రోల్ చేస్తుంటారు.

ADVERTISEMENT
Latest Stories