logics-missing-in-ysrcp

వైసీపీ చేసిన, చేస్తున్న రాజకీయాలలో ఎప్పుడు ఒకటి తక్కువవుతుంది. కానీ ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీ కింద స్థాయి కార్యకర్తల వరకు దాన్ని ఇప్పటి వరకు కూడా గుర్తించలేకపోతున్నారు.

ఉదాహరణకు బాబాయ్ వివేకా హత్యారోపణలు విషయమే తీసుకున్నా ఆయన గుండె పోటుతో మృతి చెందారు అంటూ మొదట తమ సొంత సాక్షిలో వార్తలు ప్రచురించి, ఆ పిదప దానిని హత్యగా ధృవీకరించి, ఆ మరకలను పసుపు జెండాతో తుడవాలని అందులో బాబు హస్తం ఉందంటూ నారావారి రక్త చరిత్రగా ప్రచారం చేసారు.

Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!

అయితే ఇందులో జగన్ పాక్షికంగా కొంతవరకు పై చేయి సాధించినప్పటికీ వైసీపీ చేసిన ఆ రాజకీయంలో ‘ఒకటి తక్కువయ్యింది’ అని ప్రజలు గ్రహించారు. ఇక అమరావతిని కాదని విశాఖే రాజధాని అంటూ రుషికొండకు గుండు కొట్టి మరి వందల కోట్ల ప్రజాధనాన్ని తగలేసి విలాసవంతమైన ప్యాలస్ లు నిర్మించిన జగన్ రాజకీయాల్లోను ‘ఒకటి తక్కువయ్యింది’.

ఇక తాజాగా అల్లు vs మెగా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్ వార్ లో సైతం వేలు పెట్టి వైసీపీ చేస్తున్న రాజకీయం లోను ‘ఒకటి తక్కువయ్యింది’. ఒకటి తక్కువయింది…ఒకటి తక్కువయ్యింది అంటున్న ఆ ఒకటి ‘లాజిక్’. వైసీపీ చేస్తున్న రాజకీయంలో కానీ ఆ పార్టీకి సంబంధినచిన నేతలు చేస్తున్న విమర్శలలో కానీ ఎప్పుడు ‘లాజిక్ తక్కువ’వుతుంది.

Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!

మెగా కు వ్యతిరేకంగా అల్లు బ్రాండ్ మోస్తున్నట్టు నటిస్తున్న వైసీపీ దీన్ని అడ్డుపెట్టుకుని జనసేన మీద పరోక్ష రాజకీయ యుద్ధం ప్రకటించాలని భావిస్తుంది. అయితే వైసీపీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతుంది. గతంలోనూ వైసీపీ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికిన చిరు ని కూడా వైసీపీ ఇంతే గొప్పగా భుజాన కెత్తుకుని పవన్ ను జనసేనను టార్గెట్ చేసింది.

ఇక ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఈ అన్నదమ్ముళ్ల అనుబంధం ఎంత గట్టిదో అర్ధమయ్యి పవన్ తో పాటుగా చిరు కుటుంబాన్ని కూడా అవమానించింది. ఇప్పుడు నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికిన బన్నీ ని అడ్డుపెట్టుకుని మళ్ళీ అదే తరహా రాజకీయానికి తెరలేపింది. అయితే ఈ అల్లు vs మెగా అనేది ఎప్పటి వరకు సాగుతుందో అప్పటి వరకు మాత్రమే వైసీపీ బన్నీని భుజాన మోస్తుంది.

Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్‌ విశాఖపట్నమే!

ఇక ఆ తరువాత సొంత చెల్లిని, తల్లినే కనికరించని వైసీపీ నైజం బన్నీ పట్ల నిబద్దత ను కలిగి ఉంటుందా.? ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తీసుకున్న రాజకీయ నిర్ణయానికి జనసేన కానీ పవన్ కానీ, మెగా కుటుంబం కానీ బన్నీకి వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. అలాగే ఇటు అబీని కూడా తన స్నేహితుడికి మద్దతు తెలియ చేసాడే కానీ టీడీపీ, జనసేన ల మీద ఎటువంటి విమర్శలు గుప్పించలేదు.

అప్పుడు చిరు అభిప్రాయం పట్ల, ఇప్పుడు బన్నీ నిర్ణయం పట్ల అదే హుందా తనాన్ని చూపించిన పవన్ అది వారి వ్యక్తిగత అభిప్రాయం అనే దోవలోనే ముందుకెళ్లారు. ఇప్పుడు కూడా పుష్ప సినిమా మీద కానీ, అల్లు అర్జున్ మీద కానీ జనసేన పార్టీ నుండి వారిని అగౌరవ పరిచేలా కానీ కించపరిచేలా ఎటువంటి పోస్టులు పెట్టలేదు. ఎవరు ఏ పార్టీ కి మద్దతు ఇవ్వాలి, ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకోవాలి అని నిర్దేశించే హక్కు ఏ ఒక్కరికి లేదు.

ఆ నిబంధనకు జనసేన, టీడీపీ పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. ఎన్టీఆర్ కూతురుగా ఉన్న పురందరేశ్వరి తండ్రి స్థాపించిన టీడీపీ ని కాదని కాంగ్రెస్, ఆ తరువాత బీజేపీ కండువాలు కప్పుకున్నారు. అయినా టీడీపీ నేతలు కానీ బాబు కానీ పురందరేశ్వరి మీద కానీ ఆమె కుటుంబం మీద కానీ ఏనాడు వ్యక్తిగత దాడికి తెగబడలేదు.

ఈ రెండు కుటుంబాల మధ్య పార్టీల పరంగా రాజకీయ విమర్శలే తప్ప ఏనాడు అవి కుటుంబ బంధాలను తుంచేలా దిగజారలేదు. అలాగే జనసేన కు కాకుండా వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికిన సొంత కుటుంబ సభ్యుడైన బన్నీ విషయంలో కూడా ఆయన వ్యక్తిగత స్వేచ్చకు ఎవరు అడ్డుకట్ట వేయలేదు, అలాగే ఆయన కుటుంబాన్ని కించపరిచేలా ఎక్కడ పార్టీ పరంగా విమర్శలు చెయ్యలేదు.

కానీ వైసీపీ మాత్రం తనను, తన పార్టీని కాదని సొంత చెల్లి షర్మిల కాంగ్రెస్ జెండా పట్టుకుండానే నెపంతో ఆమె పుట్టుకనే అనుమానించేలా, తల్లి విజయలక్ష్మిని అవమానించేలా, తండ్రి రాజశేఖర్ రెడ్డిని కించపరిచేలా తమ సొంత మీడియాలో కథనాలు ప్రచారం చేసారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా అనే బూతంలో షర్మిల వ్యక్తిగత జీవితం మీద నిందలు మోపి ఆమె కుటుంబాన్ని కించపరిచేలా పోస్టు పెట్టారు వైసీపీ నేతలు.




బాబు కానీ పవన్ కానీ తమను, తమ పార్టీని కాదని పక్క పార్టీల జెండాలు మోసిన కుటుంబ సభ్యులను ఎన్నడూ అమర్యాదగా మాట్లాడిందే లేదు. కానీ తనను, తన పార్టీని కాదని అడుగు ముందుకేసిన సొంత చెల్లిని, తల్లిని సైతం వెంటాడిన వైసీపీ రాజకీయంలో, ఆ పార్టీ నేతలు చేసే విమర్శలలో ఎప్పుడు ‘లాజిక్’ తక్కువయ్యింది. ఇప్పటికైనా ఆ లాజిక్ ను గుర్తెరిగి వైసీపీ నడుచుకుంటే ఇక ముందు ప్రత్యర్థి పార్టీల చేతికి చిక్కకుండా ఉంటుంది.