జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర యలమంచిలిలో మాట్లాడుతూ. “నేను చిన్నప్పుడు విజయ డైరీ పాలు కొని తెచ్చేవాడ్ని కానీ ఇప్పుడు ఆ డైరీ లేదు, హెరిటేజ్ డైరీ వచ్చింది. ప్రైవేట్ లాభాల కోసం రైతులందరికీ సమానంగా లాభం అందించే ఒక కోపరేటివ్ సిస్టంని వీళ్ళు ఒక పద్దతి ప్రకారం చంపేస్తున్నారు,” అని ఆరోపించారు.
అయితే విజయ పాలు ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలో లభిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎక్కువ పాలు సేకరించే సంస్థ విజయ డైరీనే. ఆ విషయానికి వస్తే విజయా డైరీకి చెందిన పాలు అన్ని షాపులలోను, రైల్వే స్టేషన్లలోనూ దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్ లోని చాలా ఏరియాలలో హెరిటేజ్ పాల కంటే వీటి లభ్యత ఎక్కువ.
అసలు ఆ డైరీనే లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పడం ఆశ్చర్యకరం. దేనికి కాలు కదపాల్సిన అవసరం లేని పవన్ కళ్యాణ్ కు ఆ విషయం తెలియకపోవడం వింతేమీ కాదు అయితే ఆయన చుట్టుపక్కల వారు, స్పీచ్ లు రాసి ఇస్తున్నవారు కూడా వాటిని చేసుకోకపోవడం విచారకరం. ఏదో విధంగా చంద్రబాబుని ఇరుకున పెట్టేస్తే చాలు అన్నట్టుగా ఉంది వ్యవహారం.



