అసెంబ్లీలో ఎదురుపడ్డ బాలయ్య, రోజా… ఆ తరువాత ఏం జరిగిందంటే

MLA Roja - Balakrishnaఒకప్పుడు జంటగా సినిమాలలో నటించిన బాలకృష్ణ, రోజా ఈ మధ్య కాలంలో రాజకీయ విరోధులుగా మారిపోయారు. రోజాను బాలయ్య పెద్దగా టార్గెట్ చెయ్యనప్పటికీ ఆమె మాత్రం ప్రతిపక్షంలో ఉండగా బాలయ్య మీద తీవ్ర విమర్శలే చేసేవారు. అయితే ఈ రోజు అసెంబ్లీ లాబీల్లో ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎదురుపడ్డారు. బాగున్నారా.. అంటూ పరస్పరం పలకరించుకున్నారు. గతంలో ఆమె చేసిన విమర్శలను బాలయ్య పట్టించుకోకపోవడం గమనార్హం.

ADVERTISEMENT

మరోవైపు బాలయ్యకు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా శుభాకాంక్షలు తెలపడానికి ఎగబడటం విశేషం. అంతకముందు లాబీల్లో కనిపించిన రోజాను సెల్ఫీల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టారు. కొందరు ఆమెకు మంత్రి పదవి దక్కక పోవడం ప్రస్తావించినా ఆమె చిరునవ్వుతో దాటేశారు. కార్యకర్తల సందడి ఎక్కువగా ఉండడంతో సభలోకి వెళ్లడానికి టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇబ్బంది పడ్డారు. మార్షల్స్ దారి చూపడంతో ఆయన సభలోకి వెళ్లగలిగారు.

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడిగా చర్చ జరుగుతుంది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టారు. ఆయన సభలోకి రాగా.. సభ్యులంతా గౌరవసూచకంగా నిలబడి స్వాగతం పలికారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఆహమ్మద్ మహమ్మద్‌, టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ యనమల రామకృష్ణుడితో పాటు సభ్యులందరికి వైఎస్‌ జగన్‌ అభివాదం చేసారు. టీడీపీ ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్‌కు వైఎస్‌ జగన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories