ఇటువంటి లోజిక్కులు మాట్లాడితే మొదటికే మోసం రావొచ్చు రోజా గారు!

MLA Roja comments on chandrababu naidu polavaram corruptionకేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పోలవరం వస్తున్నాడంటే అక్కడికి ఎపి సిఎం చంద్రబాబు ఎందుకు వెళ్లారన్న దానిపై రోజా విచిత్ర వాదనకు దిగారు. పోలవరంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, నితిన్ గడ్కరీ పోలవరం పర్యటనలో ఎక్కడ బయటపెడతారోనన్న భయంతోనే చంద్రబాబు పరుగెత్తుకు వెళ్లారని రోజా చెప్పుకొచ్చారు.

ఏ కేంద్రమంత్రి వచ్చినా పెద్దగా పట్టించుకోని చంద్రబాబు, గడ్కరీ వస్తే వెళ్లడానికి కారణమిదేనని రోజా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కు వరప్రదాయిని వంటి పోలవరం నిధుల విడుదల గడ్కరీ చేతుల్లో ఉంటుంది కాబట్టి చంద్రబాబు వెళ్లక తప్పదు. అయినా చంద్రబాబు వెళ్తే మాత్రం ఆయన అవినీతిని గడ్కరీ బయట పెట్టడం మానేస్తారు?

ADVERTISEMENT

ఇప్పుడు మిత్రపక్షాలు కూడా కారు. పైగా బీజేపీతో టీడీపీ రోజు కయ్యానికి కాలు దువ్వుతుంది. అధికారిక హోదాలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు మంత్రిని కలిసి ఉండవచ్చు. మరి వైకాపా వారు తరచుగా ప్రధానిని కలవడం ఏమనుకోవాలి? ఇటువంటి లోజిక్కులు మాట్లాడితే మొదటికే మోసం రావొచ్చు రోజా గారు!

ADVERTISEMENT
Latest Stories