
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ఓ 15 నెలలు ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నప్పటికీ, మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అవుతున్నారు. ఏప్రిల్ 27న బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభతో కేసీఆర్ ప్రజల మద్యకు రావాలనుకుంటున్నారు.
ఆలోగా ఏప్రిల్ 12 నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వాటికి ఆయన హాజరావుతారో లేదో ఇంకా తెలియదు. కానీ హాజరైతే తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ వేడి పెరుగుతుంది.
Also Read – కోర్ట్: నాని జడ్జ్ మెంట్ బాగుంది..!
ఈ నెల 20న ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఎమ్మెల్యేల కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం వాటిలో 4 కాంగ్రెస్‌కి, ఒకటి బిఆర్ఎస్‌కి దక్కుతుంది. రెండో అభ్యర్ధిని గెలిపించుకునేందుకు బిఆర్ఎస్ పార్టీకి తగినంత మంది ఎమ్మెల్యేలు లేరు. అయినా రెండు స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టాలని కేసీఆర్ నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలని తెలివిగా ఉపయోగించుకొని వారిపై అనర్హత వేటు వేయించాలనే కేసీఆర్ ఆలోచన ఆయన రాజకీయ చాణక్యానికి అద్దం పడుతోంది.
Also Read – తమిళనాడుకి దూరంగా చంద్రబాబు… దగ్గరవుతున్న పవన్!
సాధారణంగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఆయా పార్టీలు తమ ఎమ్మెల్యేలకు ‘విప్’ జారీ చేస్తుంటాయి. వాటిని ధిక్కరిస్తే వారిపై అనర్హత వేటు వేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయించారు.
కానీ వారిపై అనర్హత వేటు పడి ఉప ఎన్నికలొస్తే, బిఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేయాల్సి ఉంటుంది. ఆ 10 స్థానాలు గెలుచుకోవలసి ఉంటుంది. లేకుంటే మరోసారి కేసీఆర్ పరువు పోతుంది. కనుక వారిపై అనర్హత వేటు వేయించడం కంటే ఆ భయంతో వారిని బిఆర్ఎస్ పార్టీలోకి రప్పించుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!
కనుక ‘విప్’ వార్తని మీడియాకు లీక్ చేయించారు. అది చూసి 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలోకి తిరిగి రావాలనుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కనుక కేసీఆర్ పావులు కదపడం మొదలుపెడితే ఆట ఏవిదంగా సాగుతుందో చిన్న శాంపిల్ చూపారనుకోవచ్చు.
వరంగల్ సభ తర్వాత 12 నెలలపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఉత్సవాలు పేరుతో కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. ఈ పేరుతో మళ్ళీ ప్రజలకు చేరువవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. కనుక కేసీఆర్ నిజంగా రాజకీయంగా యాక్టివ్ అయితే తెలంగాణ రాజకీయాలలో చాలా వేడి పెరుగుతుంది.
కేసీఆర్ యాక్టివ్ అవుతున్నారు కానీ మూడు ప్యాలస్‌ల మద్య కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్న మన నవ యువకుడు జగన్ ఎప్పుడు బయటకు వస్తారో?