అంతా అనుకున్నట్టుగానే… తెరాసలోకి మోత్కుపల్లి

Motkupalli Narasimhuluతెదేపా మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మిగిలినవారితో కాకుండా విడిగా చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. సీఎం అనుమతించిన వెంటనే తెరాస తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. తొందర్లో ముహూర్తం ఖరారు కానుందని సమాచారం.

ADVERTISEMENT

మహానాడుకు పిలవలేదు అనే నెపంతో చంద్రబాబుని తీవ్రంగా ధూషించి పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు మోత్కుపల్లి. గవర్నర్ గిరిపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆయన టీడీపీ ఎన్డీయే నుండి రావడంతో పార్టీ మారడానికి సిద్ధం అయిపోయారు. టీడీపీ తెరాసతో విలీనం అవ్వాలని మీడియా ముఖంగా చెప్పడంతో పార్టీ ఆయన ఉద్దేశం గ్రహించి పక్కన పెట్టడం మొదలు పెట్టింది.

చివరికి మహానాడుకు పిలవలేదు అనే వంకతో కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబుకు శాపనార్ధాలు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు తెరాసలో జాయిన్ కావడానికి సిద్ధం అవుతున్న మోత్కుపల్లి గతంలో కేసీఆర్ ను కూడా అదే రేంజ్ లో దూషించిన విషయం పాఠకులకు తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories