హిందూపురం వైసీపీ ఎంపీ గోరంతల మాధవ్ ఓ వివాదంలో ఇరుకొన్నారు. ఆయన పూర్తి నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై ఐ-టిడిపి శ్రేణులు సోషల్ మీడియాలో చురుకుగా స్పందిస్తున్నాయి. ఇటువంటి మదపిచ్చి నేతను సిఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే పార్టీలో నుంచి బహిష్కరించాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ విలేఖరి ఇదే విషయంపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివరణ కోరగా, ఆయన తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. “ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. టిడిపి నేతలు నన్ను రాజకీయంగా నేరుగా ఎదుర్కొలేకనే ఇటువంటి నీచమైన పనులు చేస్తున్నారు. నారా లోకేష్ అనుచరులు ఇద్దరు ఈ నకిలీ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు సమాచారం ఉంది. నా ప్రతిష్టకు భంగం కలిగించినవారిని ఎవరినీ విడిచిపెట్టను. ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశాను. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడుతాను,” అని హెచ్చరించారు. తాను జిమ్‌లో వ్యాయామం చచేస్తున్నప్పుడు తీసిన వీడియోను టిడిపి నేతలు మార్ఫింగ్ చేసారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.
అయితే గోరంట్ల మదపిచ్చితో నగ్నంగా నిలబడి మహిళతో వీడియో కాల్ చేసి మాట్లాడింది కాక మళ్ళీ టిడిపిని నిందిస్తూ కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని, కనుక ఆ వీడియోను ఫోరెన్ సిక్ ల్యాబ్‌కు పంపించి దానిలో ఉన్నది గోరంట్ల అవునా కాదా తేల్చాలని టిడిపి నేతలు వాదిస్తున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితా వంగపూడి స్పందిస్తూ, “ఇటువంటి మదపిచ్చి ఉన్న ఎంపీ ప్రజల మద్య తిరుగుతుంటే రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉండదని కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి తక్షణం అతనిని పార్టీలో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ గోరంట్ల వీడియో వివాదం చివరికి ఏవిదంగా ముగుస్తుందో తెలీదు కానీ ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి నిజానిజాలు బయటపెడితే బాగుంటుంది కదా?