విజయ్‌ అనే నేను….

Vijay Swearing Ceremony

టీవీకే పార్టీ అధినేత విజయ్‌ జోసెఫ్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్‌తో సహా తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారిలో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు కాగా మిగిలిన వారందరూ టీవీకే పార్టీ ఎమ్మెల్యేలే. గవర్నర్‌ అర్లేకర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు బయట నుంచి మద్దతు ఇస్తున్నందున అవి మంత్రి పదవులు తీసుకోలేదు. విజయ్‌ ప్రమాణ స్వీకారానికి నటి త్రిష కూడా హాజరయ్యారు.

ADVERTISEMENT

సుమారు వారం రోజుల పాటు సాగిన ఈ రాజకీయ డ్రామాలో… విజయ్‌ గవర్నర్‌ చుట్టూ తిరుగుతూ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించగలిగారు. ఆయన ప్రభుత్వం ఏర్పాటు కోసమే తిరిగినప్పటికీ, గవర్నర్‌.. అయన వెనకున్న కేంద్ర ప్రభుత్వం విజయ్‌ పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నాయనే భావన అందరిలో కలిగింది. ప్రస్తుతం ప్రజలు ఆయన పట్ల చాలా సానుభూతితో ఉంటారు కనుక కొన్ని నెలల వరకు ఏ రాజకీయపార్టీ ఆయన జోలికి పోదు.

ఈ ఎన్నికలలో డీఎంకే… దాని అధినేత స్టాలిన్ ఓడిపోయినప్పటికీ, దాదాపు వారం రోజులుగా సాగిన ఈ నాటకీయ పరిమాణాలను ఆయనే శాశించి, నడిపించారని చెప్పవచ్చు. విజయ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు తన మిత్రపక్షాలతో మద్దతు ఇప్పించి పరోక్షంగా తోడ్పడటం ద్వారా ప్రజల మనసులు గెలుచుకున్నారు. అదే సమయంలో విజయ్‌ ప్రభుత్వం తన చెప్పుచేతల్లో నడిచేలా చేసుకున్నారు కూడా. విజయ్‌ బిజేపితో చేతులు కలపకుండా అడ్డుకున్నారు.

కనుక ఈ రాజకీయ డ్రామాలో ఇద్దరు హీరోలున్నారు. ఒకరు అనుకున్నది అనుకున్నట్లు సాధించిన విజయ్‌, 2. తమిళనాడు రాజకీయాలు బిజేపి చేతిలోకి వెళ్ళిపోకుండా అడ్డుకున్న డీఎంకే అధినేత స్టాలిన్.

ADVERTISEMENT
Latest Stories