మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నేడు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు అనుమతితో ఇద్దరు న్యాయవాదులను వెంటబెట్టుకొని వచ్చారు.
అసలు మద్యం కుంభకోణమే జరగలేదని అంతా చాలా పారదర్శకంగా సాగిందని వైసీపీ వాదిస్తున్నప్పుడు విచారణలో మిథున్ రెడ్డి ఏదో చెపుతారని ఆశించలేము.
బహుశః తనకేమీ తెలియదని ఈ కేసుతో తనకు సంబంధమే లేదని, రాజకీయ కక్ష సాధింపుకే తనని ఈ కేసులో ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మిథున్ రెడ్డి రొటీన్ ఆరోపణలు చేయడం ఖాయమే.
అయితే సిట్ అధికారులు చాలా తెలివిగా మిథున్ రెడ్డి కంటే ముందు విజయసాయి రెడ్డిని పిలిచి ప్రశ్నించి కొన్ని వివరాలు రాబట్టారు. విచారణ అనంతరం ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “మిధున్ రెడ్డి, కసిరెడ్డి రాజ్ తదితరులు అందరూ ఈ మద్యం కుంభకోణంలో సూత్రధారులు లేదా పాత్రధారులని, వారందరూ తన ఇంట్లోనే సమావేశమయ్యి దీని కోసం పధక రచన చేశామని చెప్పారు.
కనుక మిథున్ రెడ్డి సిట్ అధికారులకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసి, ఏదో విదంగా ఈ కేసుతో హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళేందుకు ప్రయత్నించడం ఖాయమే.
ఒక్కసారి పోలీస్ పరిధిలో నుంచి బయటపడి న్యాయస్థానాలకు ఈ కేసుని తీసుకు వెళ్ళగలిగితే ఆ తర్వాత దీంతో చెడుగుడు ఎలా ఆడుకోవాలో వైసీపీ నేతల కంటే ఎవరికి బాగా తెలుసు?
పోలీసుల విచారణలో ఆయన ఏం చెప్తారో.. తర్వాత మీడియాతో ఏం చెప్తారో సులువుగానే ఊహించుకోవచ్చు. కనుక విజయసాయి రెడ్డి సాయంతోనే ఈ కేసుని చేదించాల్సి వస్తుందేమో?కానీ ఆయన తోడ్పడతారో లేదో?




