ఐదేళ్ల ఉద్యమం నీరుకారిపోకుండా ఏదన్నా పార్టీలో చేరాలి అన్న విషయం చర్చిస్తున్నాము అని మాజీ మంత్రి, కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు. తమ ప్రజల డిమాండ్ల సాధన కోసం ఎలాంటి నిర్ణయం మంచిదంటే అలానే చేస్తామన్నారు. మా జాతిలోని పెద్దలు.. మాజీ అధికారులతో కలసి చర్చిస్తున్నాం అని ముద్రగడ తెలిపారు.
[m9ad]
అయితే ఇక్కడ అసలు గ్రహించాల్సింది ఏమిటంటే… ఐదేళ్ల పాటు ఉద్యమం ఏమి జరిగినట్టు? తునిలో రత్నాచల్ ఎక్సప్రెస్ తగలబెట్టిన రోజే ఉద్యమం నీరుగారి పోయింది. తరువాత ఒక సందర్భంలో ఆమరణ నిరాహార దీక్ష అన్నారు అక్కడ నుండి ప్రభుత్వానికి డెడ్ లైన్లు ఇస్తూ పోయారు తప్ప చేసింది ఏమీ లేదు.
ఒకరకంగా ముద్రగడ పద్మనాభం సరైన నాయకత్వం అందించకపోవడం వల్లే ఉద్యమం ముందుకు వెళ్ళలేదు అనే దాంట్లో నిజం లేకపోలేదు. పైగా ప్రభుత్వానికి తరచు లేఖలు రాయడంతో కాలం గడిపారు. ఆ లేఖలు చదివిన వారికి అది ఆయనకు చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లా కనిపించింది గానీ పోరాటంగా అనిపించలేదు.



