అయ్యా మీకో దణ్ణం… వైసీపితో నాకు సెట్ కాదు!

Mudragada-Padmanabham

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో ప్రతీ ఎంపీ, ఎమ్మెల్యే సీటు వైసీపియే గెలుచుకోవాలని పట్టుదలతో బోలెడంత కసరత్తు చేసి జాబితాలు విడుదల చేస్తుంటే, మరో పక్క రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వైసీపికి వ్యతిరేకంగా మారుతుండటం విశేషం.

ADVERTISEMENT

టిడిపి, జనసేనలు కలిస్తే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం వాటివైపు వెళ్ళిపోతుందనే భయం, ఆందోళనతో ఆ రెండు పార్టీలు కలవకుండా చేసేందుకు జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో కాపు నేత ముద్రగడ పద్మనాభానికి పెద్దాపురం టికెట్‌ ఆశ చూపించి వైసీపికి అనుకూలంగా మాట్లాడించారు. కాపులను ఆకర్షించడానికి ఆయన సహకారం అవసరమనుకున్నప్పుడు, జగన్‌ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ఉండాలి. కానీ టికెట్‌ విషయంలో మళ్ళీ సైలెంట్ అయిపోవడంతో ఆయన ఆత్మగౌరవం దెబ్బతింది.

ఇంతకు ముందు కూడా ఓసారి ఇలాగే వైసీపిలో ఆయనకు పెద్ద పీట వేస్తామని, వైసీపి అభ్యర్ధిగా పోటీ చేస్తే ఎన్నికల ఖర్చులు కూడా పెట్టుకుంటామని జగన్‌ హామీ ఇచ్ఛిన్నట్లు సమాచారం. కానీ జగన్‌ ఆ తర్వాత ఆయనను పట్టించుకోలేదు.

మళ్ళీ కొన్ని వారాల క్రితం ఆయనతో రాయబరాలు నెరిపి పెద్దాపురం టికెట్‌ అన్నారు. కానీ నిన్న రాత్రి వైసీపి మూడో జాబితాలో ఆయన పేరు కనిపించలేదు! కనీసం ఉభయ గోదావరి జిల్లాలలో ఆయన సూచించినవారి పేర్లు కూడా లేకపోవడంతో ముద్రగడ పద్మనాభం వైసీపికి దణ్ణం పెట్టేశారు.

ఇప్పటికే టిడిపి, జనసేన నేతలు కిర్లంపూడిలో ఆయన నివాసానికి వెళ్ళి మాట్లాడారు. ఆయన జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మూడో జాబితా విడుదలైన తర్వాత వైసీపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిన్న రాత్రి ఆయనతో మాట్లాడేందుకు కిర్లంపూడి వద్దామని బయలుదేరుతుంటే, “అయ్యా… మీరు మా ఇంటికి రానవసరం లేదు. వైసీపితో నాకు సెట్ అవదు. వీలైతే టిడిపి, జనసేనలలో ఏదో ఓ పార్టీలో చేరుతాను లేకుంటే ఇంట్లో కూర్చొంటాను తప్ప వైసీపిలో చేరే ప్రసక్తే లేదు,” అని ముద్రగడ పద్మనాభం తేల్చి చెప్పేసిన్నట్లు తెలుస్తోంది.

ఆయన ఈ మాటకు కట్టుబడి టిడిపి లేదా జనసేనలో చేరితే ఒక్క ఉభయ గోదావరి జిల్లాలనే కాదు మిగిలిన జిల్లాలలో కూడా కాపు సామాజిక వర్గం టిడిపి, జనసేన కూటమి వైపు మొగ్గు చూపడం ఖాయమే.

అంటే ఇంతకాలం జగన్మోహన్‌ రెడ్డి ఏది జరగకూడదని భయపడ్డారో చివరికి అదే జరుగబోతోందన్న మాట! వైసీపిలో అసమ్మతి సెగలు, రాజీనామాలు, వైఎస్ షర్మిల ఎంట్రీ, కేసీఆర్‌ నిసహాయత ఇప్పుడు ఈ తాజా రాజకీయ పరిణామాలన్నీ చూస్తుంటే వైసీపికి రోజులు దగ్గర పడిన్నట్లే కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories