జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ‘బిగ్ బాస్’ షోలో ముమైత్ ఖాన్ ను భరించలేకపోతున్నారనేది బహిరంగ విషయమే. ఓ సారి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ హౌస్ లోకి ప్రవేశించిన సమయంలోనే, ఆమెను అనవసరంగా తీసుకువచ్చారని, ఆమెను వెంటనే ఎలిమినేట్ చేయాలంటూ ట్విట్టర్ వేదికగా ఓ నినాదం మారుమ్రోగిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ప్రేక్షకుల మొరను ‘బిగ్ బాస్’ యాజమాన్యం పట్టించుకున్నట్లుంది. తాజాగా జరిగిన వీకెండ్ లో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఇప్పటికే 50 రోజులు పూర్తయిన ఈ షోకు ఇంకా, 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అంటే మరో రెండు వారాల పైబడి అన్న మాట. ప్రస్తుతం హౌస్ లో నవదీప్, దీక్షా పంత్, ప్రిన్స్, ఆదర్శ్, అర్చన, హరితేజలు మాత్రమే ఉన్నారు. 50 లక్షలు అందుకునే విజేత వీరిలోనే ఉన్నారు. వెళ్తూ వెళ్తూ బిగ్ బాస్ అందించిన బాంబ్ ను హౌస్ కెప్టెన్ హరితేజపై విసిరి వెళ్ళింది ముమైత్. హౌస్ సభ్యులలో ఎవరు నిబంధనలను ఉల్లంఘించినా, హరితేజ వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో దూకాలనేది ముమైత్ విసిరిన ‘బాంబ్.’


