మీడియా ప్రశ్నకు తుంటరి జవాబు ఇచ్చిన దేవిశ్రీ!

Music Director Devi Sri Prasad satire on his marriageప్రస్తుతం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న దేవిశ్రీప్రసాద్ వివాహంపై గతంలో అనేక పుకార్లు వినిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్ ఛార్మితో ఎఫైర్ ఉందన్న వార్తలు ప్రధాన మీడియాలతో సహా హల్చల్ చేసిన సంగతి విదితమే. అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనని అప్పట్లో ఖండించిన దేవి, ఇప్పటివరకు పెళ్లి ఊసెత్తలేదు.

తాజాగా మీడియా కంటపడిన దేవికి మళ్ళీ పెళ్లి గురించి ప్రశ్న ఎదురయ్యింది. ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని?’ మీడియా వర్గాలు ప్రశ్నించగా… ‘మీకు నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదా?’ అంటూ తుంటరి జవాబు ఇచ్చాడు. దేవి చమత్కారం విని బిగ్గరగా నవ్వడం మీడియా జనాల వంతయ్యింది.

ADVERTISEMENT

ఇక, తను చేయబోయే చిత్రాల గురించి చెప్తూ…. ప్రస్తుతం చెర్రీతో చేస్తున్న ‘రంగస్థలం’ సినిమా కాకుండా రామ్‌చరణ్‌-బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాకు కూడా తానే సంగీతం అందిస్తున్నాన‌ని తెలిపాడు. అలాగే మహేష్ తో ‘భరత్ అనే నేను’ సినిమాతో పాటు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రానున్న‌ మహేశ్ బాబు 25వ సినిమాకు కూడా తానే సంగీతం అందిస్తున్నాన‌ని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories