తొలి మూడు రోజులకు గాను “పుష్ప” సినిమాకు లభించిన అపూర్వ కలెక్షన్స్ పై తీవ్ర సంతోషంలో ఉన్న చిత్ర యూనిట్ మంగళవారం నాడు తిరుపతి వేదికగా సక్సెస్ సెలెబ్రేషన్స్ ను జరుపుకున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేకపోయిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ వేడుకకు ఆలస్యంగా అయినా విచ్చేసారు.
అలాగే తన ఆలస్యానికి గల కారణాన్ని హాస్యాస్పదంగా చెప్పుకొచ్చారు. “సునీల్ గారు అన్నట్టు మీకేంటబ్బా… రెండు సంధులు తిరిగితే వెన్యూ వచ్చేస్తది, మేము చెన్నైలో కారెక్కి, కారులో మన రోడ్డులో పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి ఉగుతూ, తూగుతూ, ఆగుతూ వచ్చి చేరేటప్పటికి ఈ టైం అయ్యింది, ముందుగా లేట్ అయినందుకు సారీ చెప్పారు” దేవి.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రోడ్ల స్థితిగతుల గురించి దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు చేరితే! అసలే సినీ పరిశ్రమ మీద గుర్రుగా ఉన్న ఏపీ సీఎం, ఈ వ్యాఖ్యలకు మరింత హర్ట్ అయితే ఇంకేమైనా ఉందా? అన్న రీతిలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఏపీ రోడ్లు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజల మాదిరి సరిపెట్టుకుపోవాలి గానీ, అలా బహిరంగంగా వ్యాఖ్యలు చేసేస్తారా? బహుశా ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ తీరు దేవికి సరిగా తెలిసినట్లు లేదు. అందులోనూ సాక్షాత్తు ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు నాడు ఇలా మాట్లాడొచ్చా? టాలీవుడ్ దీనికి ఎంత మూల్యం చెల్లించుకోవాలో గానీ, ప్రస్తుతం ధియేటర్ల సీజ్ వ్యవహారం మాత్రం ఏపీలో ఉదృతంగా కొనసాగుతోంది.
తిరుపతి రోడ్లు పరువు తీసేసిన మ్యూజిక్ డైరెక్టర్ #దేవిశ్రీప్రసాద్.
నిన్న తిరుపతి లో జరిగిన #పుష్ప సినిమా సక్సెస్ మీట్లో తాము ఫ్లైట్ నుండి దిగి వచ్చిన తర్వాత కారులో వస్తున్నప్పుడు రోడ్లు పరిస్థితి వాళ్ల ప్రోగ్రామ్ కీ రావడం లేట్ అయ్యింది అని చెప్పారు.@iTDP_Official @JustFuSuCK pic.twitter.com/w5FomRwHOY
— 𝙿𝚁𝙰𝚅𝙴𝙴𝙽 𝙹𝙰𝙻𝚄𝙼𝚄𝚁𝚄 (iTDP) 🏹 (@Praveen_633) December 22, 2021



