ఒకప్పుడు ‘దూకుడు’ సినిమాతో 14 రీల్స్ సంస్థ… ఆ తర్వాత ‘శ్రీమంతుడు’ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ… ఈ రెండూ కూడా టాప్ రేంజ్ కు వెళ్ళిపోయాయి. ముందుగా 14రీల్స్ సంస్థ విషయానికి వస్తే… ‘దూకుడు’ తర్వాత మహేష్ బాబుతో ‘1 నేనొక్కడినే, ఆగడు’ సినిమాలు చేయగా, బాలకృష్ణతో ‘లెజెండ్’ సినిమాను తెరకెక్కించారు.
[m9ad]
దీంతో ఈ సంస్థ నుండి వస్తున్న సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అన్న భావన ప్రేక్షకులలో వ్యక్తమైంది. కానీ వరుసగా ‘హైపర్, లై’ సినిమాలు వైఫల్యాలు చెందడంతో, ప్రస్తుతం నిర్మాణానికి దూరంగా ఈ సంస్థ ఉంది. ఇదే బాటలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా పయనించే సంకేతాలు కనపడుతున్నాయా? అంటే… గమ్యం ఏదైనా రూట్ ఒకటే అవుతుండడం కలత చెందే అంశం.
వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ లో భారీ సక్సెస్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ సంస్థ, ఈ నెలలో తొలుత విడుదలైన ‘సవ్యసాచి’తో డిజాస్టర్ ను ఎదుర్కొంది. ఇక నేడు విడుదలైన ‘అమర్ అక్బర్ అంటోనీ’ సినిమా టాక్ కూడా అనుకూలంగా లేకపోవడం, ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరుత్సాహం చెందే విషయం.
ఈ సినిమా ఫలితం తేలడానికి మరికొద్ది రోజులు ఉన్నప్పటికీ, బ్లాక్ బస్టర్ ను అందుకునే అవకాశాలు అయితే లేదన్నది స్పష్టం. దీంతో తమ బ్లాక్ బస్టర్ సక్సెస్ స్ట్రీక్ లోకి రావాలంటే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే. ఒకప్పుడు ‘స్లో అండ్ స్టడీ’ఆ ఉన్న ఈ రెండు సంస్థలు… సినీ నిర్మాణంలో దూకుడు పెంచడంతోనే వైఫల్యాలు చవిచూడాల్సి వచ్చింది.



