బ్రాండ్ వ్యాల్యూ కోసం…బ్రేక్ తప్పదా?

mythri-movie-makers-risk-after-riskఎదురు దెబ్బలు తిన్న వాడికి తెలుస్తుంది…ఆ దెబ్బ విలువ ఏంటో. అదే క్రమంలో సినిమాల్లో ఎన్ని హిట్స్ ఇచ్చినా ఒక్క సినిమా చాలు నేల నాకించెయ్యడానికి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే, “కోట్లు కుమ్మరించి చిల్లర వెతుక్కోవడం లాంటిది” అని చాలా సినిమాలు రుజువు చేశాయి. అయితే ఈ కధ అంతా పక్కన పెడితే, వరుసగా సినిమాలు చేస్తూ మంచి హిట్స్ ఇస్తున్న ఒక బడా బ్యానర్ సడన్ గా మనసు మార్చుకుని సినిమాలకు బ్రేక్ ఇవ్వనుంది అని తెలుస్తుంది. అంటే దాని అర్ధం సినిమా మానేస్తారు అని మాత్రం కాదండోయ్, సినిమాల విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరించాలి అన్నది వారి ఆలోచనగా తెలుస్తుంది.

[m9ad]

ADVERTISEMENT

అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే, టాలీవుడ్ టాప్ హీరోలు అయినటువంటి ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తో వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం సినిమాలు తీసి భారీ హిట్స్ ఇచ్చింది మన ‘మైత్రీ’మూవీ మేకర్స్ సంస్థ. అయితే అలాంటి సంస్థ భవిష్యత్తు కేవలం రెండు, మూడు వారాల్లోనే ఏమయిపోతుందో అన్న భయానికి గురయ్యే పరిస్థితికి వచ్చేసింది. భవిష్యత్తుపై కాస్త భయాన్ని కలిగించేలా అలా జరిగిపోయింది. అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే, అక్కినేని నాగ చైతన్య సవ్యసాచి, మరో పక్క మాస్ మహా రాజ రవి తేజ అమర్-అక్బర్-ఆంటోనీ సినిమాల పుణ్యమా అని భారీ లాస్ ను మూటకట్టుకోవాల్సి వచ్చింది ఆ సంస్థ. ఈ క్రమంలోనే ఈ ఎదురు దెబ్బలు నేర్పిన గుణపాఠం అనుకున్నా, లేక వేరే పధం ఏమయినా పర్వాలేదు కానీ, మొత్తంగా చూసుకుంటే మాత్రం మైత్రీ వాళ్ళు ప్రస్తుతం తెరకెక్కిస్తున్న విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” మరియు సాయిధరమ్తేజ్ “చిత్రలహరి” మినహాయించి, ఇక రానున్న సినిమాలకు ప్రత్యేకంగా కధపై ఫోకస్ చేసి, ఏమైనా మార్పులు, చేర్పులు, తీసివేతలు, వడ్దింపులు చెయ్యాలి అంటే, అవన్నీ చేసి అప్పుడు సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారట.

మొత్తంగా చూసుకుంటే మైత్రి వారికి తగిలిన ఎదురు దెబ్బల పుణ్యమా అని కాస్త జాగ్రత్తగా ప్రజలు ఆమోదించే కధను తెరకెక్కించాలని అనుకోవడం, ఇంకా పచ్చిగా మాట్లాడితే మంచి సినిమాలు మాత్రమే తీస్తూ బ్యానర్ బ్రాండ్ పెంచాలి అని అనుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయంగా చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories