ఆ రికార్డులకు… ఈ కలెక్షన్స్ కు… సంబంధమే లేదు..!

Naa-Nuvve-USA-Theatre-List-Schedule,-Naa-Nuvve-USA-Theatres-Listఇటీవల విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ “నా నువ్వే” అత్యంత భారీ డిజాస్టర్ గా నమోదు చేసుకుంది. నాగార్జున “ఆఫీసర్” సినిమాకు పోటీగా నిలిచిన ఈ సినిమాకు ఇలాంటి స్పందన వస్తుందని అస్సలు ఊహించినది కాదు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై యూత్ కు క్రేజ్ ఉందనిపించే విధంగా యూ ట్యూబ్ లో ధియేటిరికల్ ట్రైలర్ ఆల్ టైం రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది విడుదలైన భారీ సినిమాల ట్రైలర్స్ ‘అజ్ఞాతవాసి, రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాలను మించి మొదటి రోజులోనే ఏకంగా 7 మిలియన్ క్లిక్స్ ను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ క్లిక్స్ ఎలా వచ్చాయి? అనేది ఇప్పటికీ ఓ మిస్టరీయే కాగా, ఈ క్లిక్స్ ను బట్టి ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద “నా నువ్వే” పరిస్థితి అత్యంత దయనీయంగా మారి, కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో డిజాస్టర్ ను నమోదు చేసుకుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories