అక్కినేని ఇంట కోడలుగా ‘కుందనపు బొమ్మ’ సమంత అడుగుపెట్టబోతోంది. నాగచైతన్యతో హైదరాబాద్ లో బందుమిత్రుల సమక్షంలో ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తూ అభిమానులను ఉత్సాహంలో నింపారు. అయితే ఫోటోలు చాలానే వచ్చాయి, ఈ వేడుకకు సంబంధించిన చిన్న వీడియో కూడా అభిమానులను పలకరించలేకపోయింది. కానీ, తాజాగా లీక్ అయిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కరతాళధ్వనుల నడుమ ఉంగరం తొడిగి, సమంతను ముద్దాడిన చైతూ, అలాగే చైతూకు రింగ్ తొడిగి ముద్దాడిన సమంత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కొద్దిమంది మధ్యనే జరిగినా, ఈ వేడుక అద్భుతంగా జరిగిందని ఈ చిన్న బైట్ చెప్పకనే చెప్తోంది. అయినా చైతూ – సమంతలకు సోషల్ మీడియా లీక్ లు బాగా కలిసివచ్చాయనే చెప్పాలి. అధికారికంగా చెప్పిన సమాచారం కంటే, ఇలా ఎవరో ఒకరు వీడియోలు, ఫోటోలు తీస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారానే ఈ జంట బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.
#chaisam engagement video.. congrats again and all the best to both of you guys 👍 pic.twitter.com/qiYvaDEi4W
— pavan (@pavanstweet) January 29, 2017
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



