నరసాపురంలో నాగబాబు కాపు మీటింగులు

Nagababu kapu meetings in naraspuramజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి తన కుటుంబం దూరమంటూనే చివరి నిముషంలో తన అన్న నాగబాబుని పార్టీలోకి తెచ్చారు. ఆయనకు నరసాపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. నరసాపురం మెగా ఫ్యామిలీ సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో ఉంది. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని మొగల్తూరులోనే నాగబాబు, పవన్ కళ్యాణ్ ల బాల్యం గడిచింది. కాపులు ఎక్కువగా ఉండే ఈ స్థానం నుండి నాగబాబు సునాయాసంగా గెలుస్తారని పవన్ కళ్యాణ్ ధీమాగా ఉన్నారు.

ADVERTISEMENT

నియోజకవర్గంలో నాగబాబు ఇప్పటివరకూ ప్రచారం మొదలు పెట్టకపోయినప్పటికీ పాత పరిచయాలతో అక్కడి కాపులను కాపు సంఘాల నాయకులను కలుస్తున్నారు. పక్క పార్టీలోని కాపు నాయకులను కూడా కలిసి జనసేనలోకి చేర్పిస్తున్నారు. కాపులు, మెగా అభిమానులు తనకు ఓట్లు వేస్తే తాను గెలిచేసినట్టే అని ఆయన అభిప్రాయంగా ఉంది. పైగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నరసాపురం ఎంపీ సీటు కిందకే వస్తుండడంతో పవన్ కు వచ్చే మెజారిటీ తో తేలికగా గెలవచ్చని ఆయన అనుకుంటున్నారు.

నాగబాబు ఈరోజు ఉదయం జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో తను – తన భార్య పేరిట ఉన్న ఆస్తుల చిట్టాను బయటపెట్టారు. తన కుంటుంబం పేర మొత్తం రూ.41 కోట్లు ఆస్తులున్నట్లు నాగబాబు అఫిడవిట్ లో చూపించారు. ఆయన తన ఆస్తులలో చరాస్థులు రూ.367350722 కోట్లుగా చూపించారు. ఇక స్థిరాస్థులు రూ.42274477 కోట్లుగా చూపించారు. అదే విధంగా తనకు అప్పులు కూడా ఉన్నాయని నాగబాబు అఫిడవిట్ లో పేర్కొన్నారు. రూ.27049798 కోట్ల అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు.

ADVERTISEMENT
Latest Stories