ఎన్టీఆర్ బయోపిక్ ను వర్మ పక్కన పెట్టేస్తాడా?

Ram Gopal Varma  NTR Biopicసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” పేరుతో స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్ ను కధగా ఎంచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ద్వారా ఎక్కడలేని పబ్లిసిటీని సొంతం చేసుకున్న వర్మ, ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పైకి తెస్తారా? లేక ఈ సినిమాను పక్కన పెట్టేస్తారా? అన్న చర్చకు ‘కింగ్’ నాగార్జున వ్యాఖ్యలు తెరలేపాయి.

అవును… తన సినిమా గురించి నాగార్జున చెప్పిన కబుర్లు పరోక్షంగా వర్మ సినిమాపై ప్రభాతం చోసుకునే సంకేతాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం ‘రాజు గారి గది 2’ సినిమా సక్సెస్ లో ఉన్న నాగ్, త్వరలోనే యుఎస్ టూర్ కు వెళుతున్నట్లుగా స్పష్టం చేసారు. ఈ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన వెంటనే వర్మతో కలిసి ఓ యాక్షన్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లుగా నాగ్ స్పష్టం చేసారు.

ADVERTISEMENT

అంటే మరో నెల రోజులలో వర్మ – నాగ్ కాంబో తెరపైకి రానుండడం ఖాయం అన్న మాట. మరి ఈ లోపున “లక్ష్మీస్ ఎన్టీఆర్”ను వర్మ పూర్తి చేస్తారా? లేక ఈ ప్రాజెక్ట్ కు శుభంకార్డు వేసేస్తారా? అన్న చర్చ ట్రేడ్ వర్గాల్లో జరుగుతోంది. వర్మ ఎప్పుడు ఏం చేస్తారో కూడా ఎవరికి అంతుపట్టని దరిమిలా, ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ బయోపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది.

ADVERTISEMENT
Latest Stories