నాగార్జున… ఇటు వైపు ఓ సారి చూడు..!

nagarjuna Rumor Politics YSRCPతన ఫ్యామిలీకి సంబంధించి గానీ, తనపై గానీ ఎలాంటి పుకార్లు వినిపించినా వరుసగా ఖండిస్తూ ‘కింగ్’ నాగార్జున ట్వీట్స్ చేస్తున్న వైనం తెలిసిందే. ఒకప్పుడు ఇలాంటి పుకార్లను లైట్ గా తీసుకున్న నాగ్, ఇటీవల కాలంలో మాత్రం తన దృష్టికి వచ్చిన మరుక్షణం, వాటిలో ఉన్న నిజానిజాలు ఏమిటో స్పష్టం చేస్తున్నారు. అయితే అలాంటి పనే నాగార్జున మరోసారి చేయాలి అన్నట్లుగా ఓ వార్త సంచలనంగా మారింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న నాగార్జున, త్వరలో వైసీపీలో చేరనున్నారని, అలాగే గుంటూరు లేదా విజయవాడలో ఎంపీ స్థానం నుండి పోటీ చేయబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జగన్ తో కలిసి నాగ్ స్నేహితుడు నిమ్మగడ్డ ప్రసాద్ బిజినెస్ ఉండడం మరియు వైఎస్ హయంలో ప్రభుత్వానికి ఉచితంగా పబ్లిసిటీ చేసి పెట్టారని దీనికి మరింత బలాన్ని జోడిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ‘రాజు గారి గది 2’ సినిమాలో బిజీగా ఉన్న నాగ్, తదుపరి సినిమాలు చేయడానికి స్క్రిప్ట్ లు వింటున్నారే తప్ప, రాజకీయ రంగం వైపు అడుగులు వేయడం లేదని లభించిన కీలక సమాచారం. అక్కినేని ఫ్యామిలీ ట్రాక్ రికార్డ్ తీసుకున్నా గానీ… ఎక్కడా రాజకీయ రంగు పులుముకున్న దాఖలాలు లేవు. దీంతో ఈ అంశాన్ని ఖండిస్తూ నాగ్ ఓ ట్వీట్ వేస్తే పోలా..!

ADVERTISEMENT
Latest Stories