Nakka Ananda Babu

విలువలు, విశ్వసనీయతే వైసీపీ పార్టీ పెట్టుబడి అంటూ ప్రచారం చేసుకునే జగన్ అండ్ కో నేతలకు టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తన ప్రశ్నలతో కౌంటర్ ఎటాక్ చేశారు. చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ ల అనుకోని కలయిక తో కంగుతిన్న వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా ఇటు బాబు పై అటు ప్రశాంత్ కిషోర్ పై విమర్శల దాడి మొదలుపెట్టారు.

చంద్రబాబు అవకాశ వాది అంటూ ఒకరు, పీకే పనైపోయింది అంటూ మరొకరు వరుస విమర్శలు మొదలుపెట్టారు. అయితే నక్కా ఆనందబాబు తన లాజికల్ ప్రశ్నలతో వైసీపీ పార్టీ నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ చెప్పేదానికి, చేసేదానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఏపీ ప్రజలకు వివరించే పనిలో పడ్డారు ఆనందబాబు.

Also Read – నమ్మలేం దొరా…!

తన తండ్రి వైస్సార్ మరణానికి కారణం రిలయన్స్ ఇండస్ట్రీ పెద్దలంటూ ప్రచారం చేసి తానూ అధికారంలోకి వచ్చాక అదే రిలయన్స్ పెద్దలకు ఎంపీ పదవులను కట్ఠబెట్టారు. అలాగే తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నఅవినాష్ రెడ్డి ని అరెస్టు కాకూండా అడ్డుకుంటూ అతనికి మద్దతుగా నిలబడ్డారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఇవేనా మీరు పాటించే విలువలు, విశ్వసనీయత అంటూ వైసీపీ నేతల విమర్శలకు తనదైన జవాబిచ్చారు.

అలాగే జగన్ మోహన్ రెడ్డికి వాడుకుని వదిలేయడం, నమ్మక ద్రోహం చేయడం అలవాటైన పనే అంటూ షర్మిల, విజయమ్మల ఉదంతాన్ని చెప్పుతూ ఇప్పుడు కొత్తగా ఆ స్థానంలోకి పీకే వచ్చి చేరడంతో అది మరోసారి రుజువుచేశారు జగన్ అంటూ లాజికల్ గా కొట్టారు నక్కా ఆనందబాబు. అయినా గెలుపోటములు అనేది ప్రభుత్వాల పై రాజకీయ పార్టీల పై ప్రజలకు ఉన్న నమ్మకంతో ముడిపడి ఉంటుంది.

Also Read – ఒక్క హిట్ ప్లీజ్…

పీకే ఆధ్వర్యంలో ఎన్నికల బరిలో నిలిచి ఓడిన రాజకీయ పార్టీలు లేవా? అలాగే అధికారానికి దూరమైనా ప్రభుత్వాలు లేవా.?తమ సొంత బలం, రాజకీయ వ్యూహాలతో నెగ్గిన పార్టీలు, అధికార పీఠం అందుకున్న నేతలు ఎందరో ఉదాహరణలుగా ఇప్పటికి ఉన్నారు. గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలలో ఎన్నికల వ్యూహకర్తలు కేవలం ఒక భాగం మత్రమే అనేది రాజకీయ నాయకులతో పాటుగా రాజకీయ పార్టీలు కూడా గ్రహించాలి.

అయినా 2019 ఎన్నికలలో గెలుపొందిన 151 ఎమ్మెల్యే లు 22 ఎంపీ స్థానాలలో గెలుపొందిన అభ్యర్థులంతా కేవలం జగన్ బొమ్మతో గెలిచిన వారే అన్ని అటు జగన్ ఇటు వైకాపా నాయకులు అందరు ఏకకంఠంగా చెప్పుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇలా ఇంచార్జ్ ల మార్పు అవసరం ఏమొచ్చింది.? ఇప్పుడు కూడా ప్రజలు కేవలం జగన్ బొమ్మ నే చూసి ఓటేస్తారు అని నమ్ముతున్న వైకాపా నేతలు ఇప్పుడు నెగ్గాలంటే ఇంచార్జ్ లను మారిస్తే సరిపోతుందా లేకా మరేమైనా చేయాలో ఆలోచించాలి అంటూ సలహాలిస్తున్నారు టీడీపీ నేతలు.

Also Read – సిఎం చంద్రబాబు నాయుడుకి కేశినేని నాని విజ్ఞప్తి