బీజేపీ అభ్యర్థి లోటస్ పాండ్ లో ప్రత్యక్షం… జగన్ తో ములాఖత్

YS Jagan - Namburi Ramalingeswara Raoఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సత్తుపల్లి బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు శుక్రవారం హైదరాబాదులో జగన్ లోటస్ పాండ్ ఇంటిలో కలిశారు. శుక్రవారం కోర్టు సందర్భంగా జగన్ తన పాదయాత్రకు విరామం ప్రకటించి ఇంటికి చేరారు. ఈ సందర్భంగా నంబూరి రామలింగేశ్వరరావు ఆయనను కలవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ భేటీపై వైకాపా వర్గాలు ఎటువంటి ప్రకటన చెయ్యకపోవడం గమనార్హం.

ADVERTISEMENT

[m9ad]

అయితే నంబూరిని విలేకర్లు వెంబడించగా చివరకు ఆయన మాట్లాడక తప్పలేదు… వైసీసీ నుంచి తమ పార్టీకి పూర్తి మద్దతివ్వాలని జగన్‌ను కోరినట్లు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఉన్నందున జగన్ ను కలిసి మద్దతు అభ్యర్ధించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పోటీ చెయ్యడం లేదు. ఇప్పుడు తమ పూర్తి దృష్టి ఆంధ్రప్రదేశ్ మీదే పెట్టామని… అయితే 2024లోగా పార్టీని తెలంగాణలో పటిష్టపరుస్తామని జగన్ ఇప్పటికే చెప్పుకొచ్చారు.

కాకపోతే వైఎస్సాఆర్ కాంగ్రెస్ మద్దతుదారులను టీడీపీ ఓటమికి ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వివిధ చోట్ల పార్టీ మద్దతు దారులు మీటింగులు పెట్టి ఇప్పటికే తెరాసకు అనుకూలంగా పని చేస్తున్నారు. మహాకూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా అన్ని స్థానాలలోనూ ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా తమ నేతలకు శ్రేణులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. అయితే పైకి మాత్రం తాము ఈ ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయమంతా బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయం మీదే నడుస్తుంది. తన కేసులనుండి తప్పించుకోవడం కోసం జగన్ ఇప్పటికే కేంద్రం ముందు సాగిల పడ్డారు అనే ఆరోపణ ఉంది. ఈ క్రమంలో ఒక బీజేపీ అభ్యర్థిని జగన్ కలవడం అనుమానించదగినదే. జగన్ లాంటి వీఐపీలు విషయం ఏంటో కనుకోకుండా అప్పాయింట్మెంట్ ఇవ్వరు. ఇది విషయం అని ఆ అభ్యర్థి చెప్పగానే అప్పాయింట్మెంట్ నిరాకరించి ఉండాలి. కానీ జగన్ ఎందుకు కలిసినట్టు? టీడీపీ ఆరోపిస్తునట్టుగా బీజేపీతో రహస్య సంబంధాలు జగన్ కలిగి ఉన్నారా?

ADVERTISEMENT
Latest Stories