అంతిమయాత్ర వేదిక మార్పు… కారణం ఇదే..!

Nandamuri-Hari-Krishna-Last--Ritesనందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన హరికృష్ణ పార్థీవదేహం ప్రస్తుతం మెహదీపట్నంలోని ఆయన నివాసం వద్ద ఉంది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అశేష అభిమానగణం కడసారిగా వీక్షించాలని విచ్చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం వరకు పార్ధీవదేహాన్ని సందర్శనార్ధం ఉంచగా, సాయంత్రం నాలుగు గంటల నుండి అంతిమయాత్ర ప్రారంభం కాబోతోంది.

[m9ad]

ADVERTISEMENT

తెలంగాణా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరగబోతున్న ఈ అంతిమయాత్ర ముందుగా మొయినాబాద్ లోని హరికృష్ణ ఫాంహౌస్ లో జరపాలని భావించగా, తాజాగా వేదిక మారింది. జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. కుటుంబ సభ్యుల కోరిక మేరకే ఈ మార్పు జరిగినట్లుగా సమాచారం.

మొయినాబాద్ లో నందమూరి జానకిరామ్ అంత్యక్రియలు జరుగగా, అదే ప్రాంతంలో హరికృష్ణకు కూడా వీడ్కోలు పలుకుతారని మీడియా వర్గాలలో తొలుత కధనాలు ప్రసారమయ్యాయి. దీంతో అభిమానుల్లో ఉన్న కన్ఫ్యూషన్ ను తొలగించేందుకు ఈ మార్పును ప్రకటించారు. ఇప్పటికే సినీ, రాజకీయ దిగ్గజాలందరూ హరికృష్ణ ఇంటికి విచ్చేసి నివాళులు అర్పించారు.

ADVERTISEMENT
Latest Stories