‘వాటర్ ట్యాప్’ గుర్తుతో పోటీ చేస్తోన్న నందమూరి హీరో!

Nandamuri Kalyan Ram MLA Movie Posterక‌ల్యాణ్ రామ్ హీరోగా ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న ‘ఎంఎల్ఏ (మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి)’ చిత్రానికి సంబంధించిన ఓ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ చిత్రంలో రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్న క‌ల్యాణ్ రామ్ త‌న పార్టీ ప్ర‌చారానికి ఉప‌యోగించి వాల్ పోస్ట‌ర్ ఫొటో ఒక‌టి నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ADVERTISEMENT

ఈ వైర‌ల్ ఫొటోలో త‌న పార్టీ గుర్తుగా ట్యాప్ (న‌ల్లా)ను ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ‘వీరభద్రాపురం గ్రామ ప్రజలు ట్యాప్ గుర్తుకే ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన’ అని ఈ వాల్‌ పోస్ట‌ర్‌లో రాసి ఉంది. పూర్తి స్థాయి కుటుంబక‌థా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి కొత్త ద‌ర్శ‌కుడు ఉపేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌ల్యాణ్ రామ్ స‌ర‌స‌న హీరోయిన్ గా కాజ‌ల్ న‌టిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories