నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి డైరెక్టర్ ఫిక్స్?

nandamuri-mokshagna-teja-tolloywood-debutనందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ శరవేగంగా జరుగుతోందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా మోక్షజ్ఞను ఎవరి దర్శకత్వంలో పరిచయం చేయాలనే దానిపై బాలయ్య బాబు మల్లగుల్లాలు పడుతున్నారని, దర్శకుడు ఎవరైనా వారాహి చలనచిత్ర బ్యానర్ అధిపతి అయిన సాయి కొర్రపాటి నిర్మాణ పర్యవేక్షణలో ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న విషయం గతంలోనే ఖరారయ్యింది.

అయితే తాజాగా దర్శకుడు విషయంలో కూడా బాలయ్య ఓ నిర్ణయానికి వచ్చేశారని, “గౌతమీపుత్ర శాతకర్ణి” ద్వారా దర్శకుడు క్రిష్ అభిరుచులు నచ్చడంతో, తన కుమారుడు మొదటి సినిమా కూడా క్రిష్ దర్శకత్వంలోనే చేయాలన్న నిర్ణయానికి బాలయ్య వచ్చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం నటనలో మెళుకువలు నేర్చుకుంటున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి దాదాపు ఒక ఏడాది పాటు సమయం ఉండడంతో అధికారిక ప్రకటన ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ADVERTISEMENT

అయితే డిసెంబర్ 16వ తేదీన జరగనున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” ఆడియో వేడుకలో మోక్షజ్ఞను క్రిష్ చేతుల్లో పెడుతున్నట్లుగా బాలయ్య బాబు ఓ అధికారిక ప్రకటన చేయాలని భావిస్తున్నా… సినిమా విడుదలైన తర్వాత ఫలితం చూసి ప్రకటన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సన్నిహితులు చెప్పినట్లుగా టాక్. అయితే బాలయ్య వన్స్ మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతారే తప్ప ఎవరి మాట వినరన్న విషయం సినీ జనాలకు, అభిమానులకు తెలిసిందే. దీంతో ‘శాతకర్ణి’ ఆడియో వేడుక సంచలన ప్రకటనలకు వేదికగా మారే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories