తారకరత్నకు టిడిపి శ్రద్ధాంజలి… వైసీపికి అవసరమే లేదు!

Nandamuri Taraka Ratna

గత ఏడాది జనవరి 27న టిడిపి యువనేత నారా లోకేష్‌ కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంబించినప్పుడు, ఆయనతో కలిసి నడిచిన తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోతే, ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.

అక్కడి వైద్యులు తారకరత్నను కాపాడేందుకు చాలా కృషి చేశారు. కానీ గుండెపోటు వచ్చే సమయానికే ఆయన గుండె ఎడమవైపు 90 శాతం బ్లాక్ ఏర్పడిందని, ఆ కారణంగా మెదడుకి చాలా సేపు రక్తం, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిన కారణంగా మెదడు దెబ్బ తిని కోమాలో ఉండగానే ఫిబ్రవరి 18వ తేదీన తారకరత్న చనిపోయారు.

ADVERTISEMENT

అందుకు ఎన్టీఆర్‌, నారా కుటుంబాలు తీవ్ర విషాదంతో బాధపడుతుంటే, వైసీపి నేతలు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూ వారిని ఇంకా నొప్పించారు. తారకరత్న చనిపోవడం కంటే వారు మాట్లాడిన మాటలే ఎన్టీఆర్‌, నారా కుటుంబ సభ్యుల గుండెల్లో గునపాల్లా గుచ్చుకొన్నాయి.

నేటికీ ఎన్టీఆర్‌, నారా కుటుంబాలు తారకరత్నని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ ఇంకా పలువురు నేడు తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకొని కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

కానీ ఆనాడు తారకరత్న మృతిపై శవరాజకీయాలు చేసిన వైసీపి నేతలు ఎవరూ ఈరోజు ఆయనను తలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరుతో శవరాజకీయాలు చేసే అవకాశం లేదు కనుక! వైసీపి, టిడిపి నేతలకి ఉన్న తేడా ఇదే!

 

ADVERTISEMENT
Latest Stories