వైరల్ : ‘సాక్షి’ మీడియాకు దొరికారు!

Nandhyala By Elections Sakshi TVనంద్యాల ఉప ఎన్నికలు తెలుగుదేశం – వైసీపీలకు ఎంత కీలకంగా మారాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభివృద్ధి పేరు చెప్పి గెలవాలని టిడిపి, నాలుగు తిట్లు తిట్టైనా గెలవాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు మీడియా వర్గాల వేదికగా బహిరంగమైన అంశాలు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్, రోజాలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ కాగా, తాజాగా ఓ వీడియో మరింతగా హల్చల్ చేస్తోంది.

నంద్యాల ఉప ఎన్నికల బరిలో వైసీపీ తరపున బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డి తరపున ఆయన కోడలు నాగినిరెడ్డి ప్రచారం చేస్తున్న తీరును సొంత మీడియా జగన్ ఛానల్ సాక్షి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను అందిస్తోంది. బహుశా ఈ విషయం గమనించారో లేదో గానీ… ప్రచారం నిర్వహిస్తున్న నాగినిరెడ్డి, ఓటర్ల చేతిలో డబ్బులు పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ADVERTISEMENT

విశేషం ఏమిటంటే… ఇది స్వయంగా జగన్ మీడియా అయిన సాక్షి షూట్ చేసింది కావడంతో, ప్రత్యర్ధుల పైకి నెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. సహజంగా ఇలాంటి ఆరోపణలు ప్రత్యర్ధి పార్టీ వర్గాలు చేస్తుంటాయి. కానీ శిల్పా మోహన్ రెడ్డి విషయంలో సొంత మీడియాలోనే ఇలాంటివి ప్రత్యక్షం కావడంతో అంతా అవాక్కయ్యారు. అది కూడా సొంత కోడలు కావడం మరింత డిఫెన్స్ లో పడేలా చేసిందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories