Nani serious look posterనాచురల్ స్టార్ నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. అందులో భాగంగా నాని తీవ్రంగా ఆలోచిస్తున్న ఓ సీరియస్ లుక్ ను విడుదల చేసారు.

ఈ సినిమా టీజర్ 18వ తేదీన రిలీజ్ చేయనున్న నేపథ్యంలో… 2 డేస్ టు గో అంటూ ఈ పోస్టర్ ను ప్రేక్షకులకు అందించారు. ఇప్పటివరకు తాను నటించిన సినిమాలో “శ్యామ్ సింగరాయ్” ప్రత్యేకమైనదని, ‘జెర్సీ’ మాదిరే ఈ సినిమాకు ప్రేక్షకుల రివార్డులు, విమర్శకుల అవార్డులు వస్తాయని ఇటీవల బాలయ్యతో పాల్గొన్న కార్యక్రమంలో ఆశాభావాన్ని వ్యక్తం చేసారు నాని.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. మిక్కి జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాలో నాని జంటగా మరోసారి సాయి పల్లవి నటించనుంది. అలాగే మరో ఇద్దరు బ్యూటీలు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు కూడా కనువిందు చేయనున్నారు.