ఈ ఆంక్షలు భువనేశ్వరి పైనా ప్రజల పైనా?

Nara Bhuvaneswari

చంద్రబాబు అరెస్టుతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో నిర్బంధాలు, ఆంక్షలు కొనసాగుతున్నాయి. తమ అధినేత అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ పార్టీ ఇచ్చే నిరసన కార్యక్రమాల మీద, బాబుకి మద్దతుగా నిర్వహించే ర్యాలీల మీద ప్రభుత్వ ఇప్పటికే ఉక్కు పాదం వేస్తుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి.

తెలంగాణ కు సంబంధించిన ఐటీ ఉద్యోగులు బాబుకు మద్దతుగా ఛలో రాజమండ్రి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో తెలంగాణ – ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలలో ఏపీ పోలీసులు అనుసరించిన వైఖరి సర్వత్రా విమర్శలకు దారితీసాయి. ఏపీ కి రావాలంటే మాకు ‘వీసా పాసుపోర్టు’ అవసరమా అంటూ ఐటీ ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వాన్ని, ఏపీ పోలీస్ వ్యవస్థను ప్రశ్నించేస్తాయికి ఆంక్షలు వెళ్లాయంటూ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి.

ADVERTISEMENT

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా, బాబుకి సంఘీభావంగా టీడీపీ అధినేత బాబు సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రి కేంద్రకారాగం వద్ద రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి కోరగా అందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. భువనేశ్వరి తలపట్టిన కార్యక్రమానికి మద్దతుగా బాబుకి సంఘీభావం తెలపడానికి రాజమండ్రికి ఎవ్వరు రావద్దు అంటూ పోలీసులు టీడీపీ మద్దతుదారులకు నోటీసులు ఇవ్వడం భువనేశ్వరి ఆగ్రహానికి కారణమైంది.

నోటీసులను ఉల్లంఘించి ఎవరైనా భువనేశ్వరిని కలిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇదే ఇక్కడ టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. అసలు మీరెవరు మా దగ్గరకు రావద్దంటూ ఆదేశాలు జారీ చేయడానికి? పోలీస్ వ్యవస్థకు ఏమి హక్కుందని ఇటువంటి నోటీసులు జారీ చేస్తున్నారు? ప్రభుత్వానికి ఉన్న అధికారాలేమిటి తమ పార్టీ కార్యక్రమాల పై ఆంక్షలు విధించడానికి? చంద్రబాబుకి మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే తప్పేమిటి? అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు భువనేశ్వరి. ఇదే పనిలో భాగంగా పోలీస్ శాఖ వారు ఇచ్చిన నోటీసులను కూడా తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు భువనేశ్వరి.

బాబు అరెస్టుతో పక్క రాష్ట్రాల వారు ఏపీకి రావాలంటే ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఈ రాష్ట్రంలో ఉన్న వారు కూడా పక్క జిల్లాకు వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి, పోలీస్ శాఖ పర్మిషన్ తప్పనిసరి అంటారేమో మరి! ఇలా ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు అనుమతులు,ఆంక్షలు అంటూ ప్రభుత్వాలు ముందుకెళ్తే ఇక రానున్నరోజులలో ఈ నోటీసులు అందుకునే వారి జాబితాలో సామాన్యులు కూడా చేరతారేమో మరి!

ADVERTISEMENT
Latest Stories