ఎన్నికల సమయంలో తమ రాజకీయ ప్రసంగాలతో వాతవరణాన్ని వేడెక్కిస్తున్న రాజకీయ నాయకుల ప్రసంగాలకు కాస్త ఊరడింపుగా ఉన్నాయి నారా భువనేశ్వరి వ్యాఖ్యలు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ధర్మవరం సభలో మాట్లాడిన నారా భువనేశ్వరి చంద్రబాబు పట్ల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించించే బాబు కి ముందు ప్రజలు ఆతరువాతే భార్య, కుటుంబం. అయన ప్రజల మనిషి ఎప్పుడు వారి గురించే ఆలోచిస్తారు. ఆయనకు భార్య ఇతర విషయాలు సెకండరీ అంటూ చెప్పుకొచ్చిన భువనేశ్వరి బాబుకి ఆమెకు మధ్య జరిగిన ఒక సరదా సంఘటనను బయటపెట్టి సభలో నవ్వులు పూయించారు.
అందరి భర్తలు భార్యల కోసం ఏదోఒకటి తెస్తారు. మీరు నా కోసం ఒక్క చీరన్న తెచ్చారా..? అని అడిగిన పాపానికి అది గుర్తుపెట్టుకుని ఎప్పుడో ఒకసారి నా కోసం బాబు గారు ఒక చీర తీసుకొచ్చారు. దాని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అంత గోరంగా ఉంది ఆ చీర. కానీ నాకోసం గుర్తుపెట్టుకొని ప్రేమతో తెచ్చారు కదా అని దాన్ని దాచుకున్నాను అంటూ సభలో భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా అందరూ పక్కున నవ్వుకున్నారు.
దీనితో ఎన్నికల ప్రచారాలతో వేడెక్కిన రాష్ట్ర వాతావరణాన్ని ఒక్కసారిగా తన మాటలతో చల్లబరిచారు భువనేశ్వరి. అలాగే ఇటు మంగళగిరిలో పర్యటించిన నారా బ్రాహ్మణి కూడా మంగళగిరి చేనేత చీరలో మెరిసిపోయారు. టాటా సీఈఓ అంబుజా తో కలిసి చేనేతల కోసం నిర్మించిన వీవర్ శాలను ప్రారంభించిన బ్రాహ్మణి మంగళగిరి అంటేనే నేతన్నలు ప్రేమతో నేసిన చీరలు గుర్తువస్తాయి అంటూ వారి చేయూతకు లోకేష్ ఎప్పుడు కట్టుబడి ఉంటారని హామీ ఇచ్చారు.
ఇలా అనుకోకుండా అత్తా, కోడళ్ళు .., భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరు చీరల గురించి.., ఒకరు మంగళగిరిలో మరొకరు ధర్మవరంలో ప్రస్తావించడం నేతకార్మికుల కష్టానికి ప్రచారం దొరికినట్లయింది.




