Nara Lokesh Jaganతండ్రి అరెస్టుతో లోకేష్ ని మానసికంగా దెబ్బ తీయాలి అని చూసిన వైసీపీ అధినేత జగన్ కు వారి నాయకులకు ఢిల్లీలో లోకేష్ ఇచ్చిన ఝలక్ మాములుగా లేదు. ఒకప్పుడు పప్పు – పప్పు అంటూ అవహేళన చేసిన వైసీపీ నేతలకు ఇప్పుడు తన మాటల తూటాలతో నిప్పులు చూపిస్తున్నారు. ఇది కూడా ఒకరకంగా లోకేష్ కు జగన్ చేసిన మేలే.

Also Read – విశాఖకు మెట్రో… భారం అవుతుందేమో?

చంద్రబాబు అరెస్ట్ తో పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్న లోకేష్ తన తండ్రి నిజాయితీని దేశానికి తెలియచేయాలనుకున్నారు. జగన్ కొట్టిన దెబ్బకు కుంగిపోకుండా రాజకీయాలలో పరిణితి చెందిన నేత ఎలా బాధ్యతగా నడుచుకుంటాడో అదే ప్రవర్తనను చూపిస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో ప్రచారానికి కూడా తడబడిన లోకేష్ ఇప్పుడు అనర్గళంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తున్నారు.

బాబు అరెస్ట్ తో లోకేష్ లో ఉన్న నాయకత్వ పటిమ అటు సొంత పార్టీ నేతలతో పాటు ఇటు వైసీపీ నేతలకు తెలిసివచ్చినట్టుంది. లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ మీడియా అయినా రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూ లో…, పలు జాతీయ ఛానల్స్ డిబేట్స్ లో పాల్గొన్నారు. అయితే ఎదుటి వాడిని తన ప్రశ్నల దాటితో కంగారు పెట్టె అర్నాబ్ లాంటి వారిని లోకేష్ ఎదుర్కున్న తీరు అందని ఆశ్చర్య పరిచింది.

Also Read – పనిచేస్తున్న ప్రభుత్వంపై ప్యాలస్‌లో కూర్చొని విమర్శలా!

ఒక్క ప్రశ్నకు కూడా తడబడకుండా, దిక్కులు చూడకుండా…ఇట్స్ లేందీ క్వశన్ అనకుండా ఇచ్చిన లోకేష్ సమాధానాలను చూస్తుంటే విమర్శకులు సైతం ప్రశంసించే తీరుగా ఉన్నాయి. చర్చలో భాగంగా జగన్ తో బహిరంగ చర్చకు కి మీరు సిద్ధమా అని అడిగిన ప్రశ్నకు ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా “బ్రింగ్ ఇట్ ఆన్” అంటూ ఇచ్చిన సమాధానం అందరిని ఆకట్టుకుంది. అక్కడే అర్ధమవుతుంది లోకేష్ కున్న కాన్ఫిడెన్స్.

అయితే ముఖ్యమంత్రిగా గడిచిన నాలుగున్నరేళ్లుగా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని.. పెట్టలేని జగన్ ఈ ఛాలెంజ్ ని అంగీకరిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. కనీసం విపక్షాలను విమర్శించాలన్నా.. ప్రభుత్వం చేసిన, చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నా… కళ్ళ ముందు స్క్రిప్ట్ పేపర్ లేకపోతే పని ముందుకు జరగని పరిస్థితి జగన్ ది.

Also Read – ఏపీలో కమల ‘వికాసం’ సాధ్యమా.?

జగన్ తానూ మాట్లాడే రికార్డెడ్ మీట్ ది ప్రెస్ లో కూడా abn , tv5 ,ఈనాడు వంటి పత్రికలకు అనుమతి ఉండదు. కానీ లోకేష్ ప్రతి ప్రెస్ మీట్ లోను సాక్షి విలేఖరిని పిలిచి మరి వారి ప్రశ్నలకు బదులిస్తారు. జగన్ రికార్డు చేసి ఎడిట్ చేసిన ప్రెస్ మీట్ లోనే ఎన్నో తప్పులు బయట పడుతుంటాయి.

దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి. సింహం సింగల్., మా అన్న పులివెందు పులి అంటూ విపక్షాల పై నోరేసుకుపడే నేతలు జగన్ ను ఒప్పించి లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం చేయాలంటూ టీడీపీ శ్రేణులు పట్టుపడుతున్నారు. బహిరంగ చర్చ మాట అటుంచి బహిరంగ సభలలో పేపర్ చూడకుండా ఒక్క పదినిముషాలు ప్రభుత్వం చేపడుతున్న పధకాల గురించి కానీ,కనీసం విపక్ష నేతలను విమర్శించినా చాలు అనేవారు లేకపోలేదు.