ప్రతిపక్షంలో ఉంటే రోడ్డు మీద, అధికారంలో ఉంటే ప్యాలస్ గేటు లోపల అన్న రాజకీయం కాదు, ప్రభుత్వంలో ఉంటే పరదాలు, ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు అనే నాయకుడు కాదు, అధికారం లేకపోతే శవ రాజకీయాలు, అధికారం ఉంటే దోపిడీ రాజకీయాలు నడిపే నేత కాదు,
గెలిచినప్పుడు వచ్చే హోదా చూసుకుని రెచ్చిపోయిన వాడు కాదు, ఓటమి వచ్చినప్పుడు లేని హోదా కోసం పాకులాడే వ్యక్తి కాదు. గెలిచినా ఓడినా ప్రజలు మధ్యే అన్నట్టుగా దూసుకెళ్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్ గెలుపుకి ముందు యువగళం అంటూ పాదయాత్ర పేరుతో ప్రజల మధ్యకు వెళ్లారు.
Also Read – కౌశిక్ రెడ్డి…పార్టీ కోసమా..? పేరు కోసమా.?
ఇప్పుడు గెలిచిన తరువాత ఒక పక్క పార్టీ పనులు చక్కబెడుతూ, ఐటీ, విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోపక్క ప్రజా సమస్యల పరిష్కారానికి ఉండవల్లి తన నివాసంలో ప్రతి రోజు ఉదయం ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నారు. నాడు యువగళం పాదయాత్రతో ప్రజల సమస్యలను అవగాహన చేసుకుంటూనే, పార్టీ క్యాడర్ కు నేనున్నాను అనే ధైర్యాన్ని అందించారు.
నేడు ప్రజా దర్బార్ తో ఇటు తనను నమ్మి ఓటేసిన మంగళగిరి ప్రజలకు స్థానిక సమస్యల గురించి విన్నవించుకోవడానికి అందుబాటులో ఉంటూనే, తన శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు అందిస్తున్నారు. తన పార్టీ అధికారంలోకి వచ్చే వరకు, తనకు ముఖ్యమంత్రి పదవి దక్కే వరకు పార్టీ కింద స్థాయి క్యాడర్ నుంచి పై స్థాయి నాయకత్వం వరకు అందరికి అందుబాటులో ఉన్న జగన్ అధికారం వచ్చాక చివరికి తల్లి, చెల్లికి కూడా అందుబాటులో లేకుండా పోయారు.
Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!
అలాగే ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు అంటూ ప్రజల మధ్య తిరిగి అధికారం చేతికందగానే ప్యాలస్ గేటు కూడా దాటలేదు జగన్. ప్రజల వద్దకే పాలన అంటూ ముఖ్యమంత్రిగా బాబు పాలన కొనసాగిస్తే, పరదాల చాటున పర్యటనలు చేసిన తొలి ముఖ్యమంత్రిగా జగన్ కొత్త చరిత్రకు నాంది పలికారు.
తండ్రి చంద్రబాబు నాయకత్వం మాదిరే లోకేష్ కూడా అటు పార్టీ క్యాడర్ కు ఇటు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ నాడు నేడు ప్రజా నాయకుడే అన్నటుగా ముందుకెళ్తున్నారు.