nara-lokesh-in-assembly

జగన్‌ వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు మొహం చాటేస్తుంటే మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులు హాజరవుతుండటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.

శాసనసభలో తమ మాట చెల్లదు.. నెగ్గదు.. కనుక తమకు ప్రధాన ప్రతిపక్షహోదా ఇస్తే తప్ప సమావేశాలకు రామని తెగేసి చెపుతున్నప్పుడు, మండలిలో కూడా వైసీపీకి అదే పరిస్థితి నెలకొన్నప్పటికీ హాజరావుతున్నారు కదా?ఇలాంటి విషయంలో కూడా వైసీపీ ద్వంద వైఖరి బయటపెట్టుకుంటోంది.

Also Read – జగన్‌ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!

రాజకీయాలలో, ప్రభుత్వ వ్యవహారాలలో చాలా అనుభవం ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ని మండలిలో ఇరుకునపెట్టపోతే, పూర్తి వివరాలు, గణాంకాలతో సహా ఆయన చెప్పిన జవాబులకు నోరెత్తలేకపోయారు.

వైసీపీ హయాంలో పాఠశాలలు మొదలు యూనివర్సిటీల వరకు విద్యావ్యవస్థలను ఏవిదంగా భ్రష్టు పట్టించిందో నారా లోకేష్‌ వివరించి, వాటిని చక్కబెట్టుకోవడానికి తాను, తమ ప్రభుత్వం ఏవిదంగా కృషి చేస్తున్నామో వివరించారు.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

ఉపాధ్యాయులను వేధించడం మొదలు యూనివర్సిటీలలో వైసీపీ బంధుమిత్రులకు వైస్ చాన్సిలర్ పదవులు కట్టబెట్టడం వరకు ప్రతీ అంశంపై మంత్రి నారా లోకేష్‌ వివరించి వైసీపీ సభ్యుల నోళ్ళు మూతపడేలా చేశారు.

ఎన్డీఏ రాజకీయాల గురించి ప్రస్తావించి నారా లోకేష్‌ని కట్టడి చేయవచ్చని వైసీపీ సభ్యులు భావిస్తే, ఆ అంశంపై కూడా తనదైన శైలిలో జవాబు చెప్పారు.

Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?

“మీ హయంలో దెబ్బ తిన్న రాష్ట్రాన్ని మళ్ళీ చక్కబెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు చాలా అవసరం. అందుకే టీడీపీ, జనసేనలు కేంద్ర ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నాయి. మాకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.

కేంద్రంతో సత్సంబంధాలు మెయిన్‌టెయిన్‌ చేస్తున్నందునే అమరావతికి, పొలవరానికి నిధులు తెచ్చుకోగలిగాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ కాపాడుకోగలిగాము. విశాఖ రైల్వే జోన్‌ సాధించుకోగలిగాము. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, ప్రాజెక్టులు సాధించుకోగలుగుతున్నాము.

మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో సఖ్యతగానే ఉండేవారు కదా?కానీ 5 ఏళ్ళలో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా సాధించగలిగారా?

మీరు 5 ఏళ్ళలో సాధించలేకపోయిన అనేక పనులను మేము కేవలం 8 నెలలలోనే సాధించుకున్నాము కదా?” అంటూ మంత్రి నారా లోకేష్‌ ఘాటుగా జవాబు చెప్పారు.




జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతీ 1-2 నెలలకోసారి ఢిల్లీ వెళ్ళేవారు. దేనికంటే రాష్ట్రానికి సంబందించిన అంశాల గురించి మాట్లాడటం కోసం, నిధుల కోసం అని చెప్పుకునేవారు. కానీ ఆక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు, అప్పుల కోసమే వచ్చేవారనే విషయం బీజేపి నేతలు బయటపెట్టారు కదా?గతం మరిచిపోయి గజినీలా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలకు ఎప్పటికప్పుడు ఇలా గుర్తుచేయడం చాలా అవసరమే.