టిడిపి యువనేత నారా లోకేష్ గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార వైసీపీకి మీసం తిప్పి మరీ సవాళ్ళు విసురుతున్నారు. నిన్న పాదయాత్రలో శ్రీలక్ష్మీగణపతి దేవస్థానం సమీపంలో ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అక్కడ గన్నవరంలో వైసీపీ గూండాలు కర్రలు, రాళ్ళు పట్టుకొని టిడిపి కార్యాలయం దాడి చేస్తే వారిపై నో కేస్… ఇక్కడ నారా లోకేష్ స్టూలు మీద నిలబడి మాట్లాడితే కేసు! అక్కడ వైసీపీ గూండాలు కత్తులు, గొడ్డళ్ళు పట్టుకొని దాడి చేస్తుంటే నో కేస్… ఇక్కడ నారా లోకేష్ స్టూలు మీద నిలబడి మాట్లాడితే కేసు!
చంద్రబాబు నాయుడుగారు ఓర్పు, సహనం వహించాలని చెపుతూ మా చేతులుకట్టేస్తున్నారు. ఇప్పుడే మీ అందరి ఎదుట నేను చెపుతున్నా… చంద్రబాబు నాయుడుగారిని ఓ చిటికేయమనండి… ఈ వైసీపీ నేతల సంగతి మేము చూసుకొంటాము. ఏం మాకు పౌరుషం లేదనుకొంటున్నారా? రా… చూస్తాను… అంటూ నారా లోకేష్ మీసం మేలేసి సవాలు విసిరారు.
మీరు అదేపనిగా రెచ్చిపోతుంటే మేము చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోము. మా ఓర్పు, సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి చేసిన వారందరినీ బట్టలూడదీసి కడ్రాయర్లలో రోడ్లపై ఊరేగిస్తాము… కబ్డదార్ వైసీపీ నేతలకి దమ్ముంటే రండి చూసుకొందాం. నేను ఇక్కడే నిలబడతాను…” అంటూ నారా లోకేష్ మీసం తిప్పి సవాల్ విసిరారు.
అంతకు ముందు నారా లోకేష్ ఓ బార్ అండ్ వైన్ షాప్ ముందు నిలుచొని దానిని చూపిస్తూ ఓ సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాని కింద “ఏపీలో మద్యపాన నిషేధం గురించి కొన్ని నిజాలు తెలియజేయాలనుకొంటున్నాను. మధ్యపాన నిషేధం హామీ పోయింది. రాష్ట్రంలో మధ్యం వ్యాపారం చేస్తున్నది జగన్ & కో, మధ్యం అమ్మకాల ద్వారా వచ్చే సోమ్మంత వెళ్ళేది తాడేపల్లి ప్యాలెస్‌కే, దేశంలో మధ్యం ధరలు ఏపీలోనే ఎక్కువ. దేశంలో మధ్యం నాణ్యత ఏపీలోనే… “ అంటూ ట్వీట్ చేసి మధ్యం అమ్మకాలతో వచ్చే డబ్బుని ప్యాలస్‌లో ఎవరు వసూలు చేస్తారు? అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకి రేణిగుంట వద్ద ఆర్ఎంపీ వైద్యులతో సమావేశమయ్యి వారి సమ సమస్యలని అడిగితెలుసుకొంటున్నారు.



