సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులతో భేటీ అయినప్పుడు తీసిన ఫోటోలు చూస్తేనే మా వైసీపీ కడుపులు తరుక్కుపోతున్నాయి. మండిపోతున్నాయి.
అలాంటిది… ఈ కుర్ర మంత్రి నారా లోకేష్ ప్రధాని మోడీకి షేక్ హ్యాండ్ ఇవ్వడం… శాలువా కప్పి బొకేలు ఇవ్వడం, పక్కన కూర్చొని కబుర్లు చెప్పడం ఎలా జీర్ణించుకోగలం?ఎన్ని ఇనో ప్యాకెట్లు వేసుకుంటే ఈ కడుపు మంట చల్లారుతుంది?
అయినా నారా లోకేష్ చిన్న పిల్లాడు… ప్రధానితో, రాష్ట్రపతితో కుదిరితే డోనాల్డ్ ట్రంప్, పుతిన్‌లతో కూడా ఫోటోలు దిగాలనుకుంటారు. కానీ ఈ మోడీకి ఏమైంది?నారా లోకేష్‌ని అలా పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పడం ఏమిటి? ఆ ఫోటోలు దేనికి? మా ప్యాలస్‌లో ఎన్ని టీవీలు బద్దలు కొట్టినా అర్ధం కావడం లేదు!
ఆనాడూ నారా లోకేష్‌తో మేము ఎలా అడుకున్నామో ఇప్పటికీ మా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. మొద్దబ్బాయి… బొద్దబ్బాయి… తండ్రి చాటు బిడ్డ… కనీసం తెలుగులో సరిగ్గా మాట్లాడటం కూడా రాదు… అంటూ తీసి పడేశాము కదా?
కానీ రాజకీయాలకు పనికిరారని మేము తీసి పక్కన పడేసినప్రతీ ఒక్కడూ ఇలా షైన్ అయిపోతున్నారేంటో? అర్ధం కావడం లేదు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, రఘురామ కృష్ణరాజు, అయ్యన్న పాత్రుడు… ఇలా మేమేవరిని టచ్ చేస్తే వాళ్ళ సుడి తిరిగిపోతోంది. పెద్ద పెద్ద పదవులు, రాజభోగాలు అనుభవిస్తున్నారు.
కానీ అదే సేమ్ చేత్తో మావాళ్ళని ఎవరిని టచ్ చేసినా వెళ్ళి జైల్లో పడుతున్నారేమిటో?చివరికి మాతో సహవాసం చేసిన పాపానికి… పాపం ఆ పెద్దాయన ముద్రగడ, కేసీఆర్ పరిస్థితి కూడా దయనీయంగా మారిందిగా?
మా చెయ్యి మాకు భస్మాసుర హస్తం కావడం ఏమిటి? అదే చెయ్యి ఎదుటవాళ్ళకి అమృత హస్తంగా మారడం ఏమిటి? ఎందువల్ల?ఒరేయ్.. అక్కడ హలో మరో కొత్త టీవీ పెట్టారా లేదా ఇంకా?





