ఈ వెయ్యి కోట్లు కూడా ఆ వెయ్యి కోట్లు లాగానేనా మోడీజీ?

Narendra Modi  - Fani Cyclone - Aerial Survey -Odishaఫొని తుఫాను సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన ఒడిశా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పర్యటించారు. గవర్నర్‌, సీఎం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే గాయపడ్డ వారికి రూ.50వేలు అందజేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి కేంద్రం 381 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది.

సహాయ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటామని తెలిపారు. ఇప్పుడు ప్రధాని సహాయ పునరావాస కార్యక్రమాల నిమిత్తం మరో రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఫొని తుఫాను గత వారంలోనే తీరాన్ని దాటినా ప్రధాని ఉద్దేశపూర్వకంగా ఒడిశా వెళ్ళలేదు. సరిగ్గా దేశవ్యాప్తంగా ఐదో విడత ఎన్నికలు జరుగుతుండగా తన పర్యటన పెట్టుకున్నారు.

ADVERTISEMENT

ప్రజలు ఓటు వేస్తున్న తరుణంలో టీవీలలో ప్రధాని పర్యటన, ఒడిశాకు సాయం అంటూ వార్తలు వచ్చేలాగా తన పర్యటనను రూపొందించుకున్నారు. అయితే ఈ వెయ్యి కోట్ల సాయంపై ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. గతంలో హుద్ హుద్ తుఫాను సందర్భంగా కూడా ప్రధాని విశాఖపట్నాన్ని సందర్శించి ఇలాగే వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. ఆ తరువాత దాదాపుగా ఏడాదికి అందులో నాలుగు వందల కోట్ల చిలుకు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఈ వెయ్యి కోట్లు కూడా ఆ వెయ్యి కోట్లు లాగనేనా అనే అనుమానం కలుగకమానదు.

ADVERTISEMENT
Latest Stories