ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం, బీజేపీ మధ్య తీవ్రమైన పోరు నడుస్తుంది. 2019 ఎన్నికలు బీజేపీ చేసిన మోసంపైనే జరగబోతున్నాయి అనేది విశ్లేషకుల అంచనా. దీనితో చంద్రబాబు బీజేపీపై అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. అయితే బీజేపీ కూడా ఆయనను ఎదుర్కోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
ఒక జాతీయ పత్రిక ఇంటర్వ్యూలో చంద్రబాబు దీని గురించి మాట్లాడారు. “వారు ఎదురుదాడికి దిగుతారు అని నేను ఊహించినదే. అయితే కేంద్రం సాయం చేస్తుంది నాలుగు సంవత్సరాలు ఓపికగా ఎదురు చూశాం. ఇంకా చేసేది ఏమి లేక బయటకు వచ్చాం. మమల్ని ఇరుకున పెట్టడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు,” అని చంద్రబాబు ఆరోపించారు.
మీ మీద మోడీ కోపంగా ఉన్నారా అన్న ప్రశ్నకు కూడా ఆయన బదులిచ్చారు. “కేంద్రం చెయ్యవలసిన విధంగా ఏపీకి సాయం చేస్తే రాష్ట్రం గుజరాత్ ను దాటేస్తుందని ఆయన అభద్రతాభావం కావొచ్చు,” అని చంద్రబాబు అన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ రెండిటికి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు.



