చంద్రబాబుపై మోడీ నిఘా పెట్టారట!

Narendra Modi - Chandrababu Naiduబీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు టీడీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో లాస్ట్‌లో అవినీతిలో మాత్రం నెంబర్ వన్‌లో ఉందని ఆయన విమర్శించారు. అభివృద్ధి కోసం రుణాలు తేవడం తప్పుకాదన్నారు. కానీ ఏపీలో అలా జరగడం లేదని వ్యాఖ్యానించారు. నిధులను దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక నిర్మాణాలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు.

[m9ad]

ADVERTISEMENT

ఇక్కడ రుణాలు తీసుకోవడమే పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం లెక్కలు చెప్పేందుకు‌ భయపడుతున్నారని విమర్శించారు. అమరావతిలో వెయ్యి ఖర్చు అయ్యే చోట పదివేలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా నిధులను పార్టీ ఫండ్‌లోకి మళ్లిస్తున్నారనే అనుమానం ఉందన్నారు.

టీడీపీ ప్రభుత్వం చేసే ప్రతి పని పైనా జాతీయ స్థాయిలో నిఘా ఉంటుందని జీవీఎల్ చెప్పుకొచ్చారు. నిఘా పెట్టడం ఆరోపణలు సరే మరి ఆధారాలు సేకరించి చంద్రబాబు ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలి కదా? అయినా తెలుగు దేశం పార్టీ ఎన్డీయే నుండి బయటకు రాకముందు ఇవన్నీ ఎందుకు రాలేదో!

ADVERTISEMENT
Latest Stories