అమరావతికి కొత్త ఊపునిచ్చిన మోడీ!

Narendra Modi Repeal Farm Lawsమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ తాను తీసుకున్న నిర్ణయం నుండి వెనక్కి తగ్గింది. వ్యవసాయ చట్టాలను రూపొందిస్తూ మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఒక్కసారిగా రైతులు రోడ్లెక్కారు. పెల్లుబూకిన ఆగ్రహంతో నాటి నుండి నేటి వరకు ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అంతిమంగా మోడీ వెనక్కి తగ్గక తప్పలేదు.

అయితే ఈ ఆందోళనలను ఎదుర్కొనే క్రమంలో పోలీసులు తీసుకున్న చర్యలలో కొంతమంది అశువులు బాసిన విషయం తెలిసిందే. అలాగే మరికొంతమంది రైతులు పోలీసులతో ప్రతిఘటించి హాస్పిటల్ బారిన పడ్డారు. అయితే వీరందరి కృషికి, సంకల్పానికి ఇప్పటికైనా న్యాయం జరిగిందంటూ హర్షం వ్యక్తం చేయడం రైతుల వంతయ్యింది.

ADVERTISEMENT

మోడీ తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా అమరావతి రైతులకు నూతన ఉత్సాహాన్ని పంచుతోంది. ప్రజా పోరాటానికి ఎంతటి ప్రభుత్వాలైనా దిగి రాక తప్పదని ప్రధాని మోడీ నిర్ణయం చెప్పకనే చెప్పింది. 30 వేల ఎకరాలను తృణప్రాయంగా రాజధాని కోసం అందించిన తమ పోరాటంలో కూడా న్యాయం ఉందని, తమకు కూడా ఖచ్చితంగా న్యాయం లభిస్తుందని ఈ సందర్భంగా అమరావతి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆలస్యమైనా ప్రజాభీష్టాన్ని గౌరవించడం పాలకుల కనీస కర్తవ్యం. మోడీ సర్కార్ దానిని గుర్తించి, ఏకంగా రైతులకు క్షమాపణలు చెప్పి మరీ తాము తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు వస్తాయా? లేదా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories