Modi to Speak Tonight at 8 PM

రాత్రి 8 గంటలకు మోడీ…

గత నెల 22 న భారత్ లోని పెహాల్గమ్ లో జరిగిన ఉగ్రదాడి సంఘటన నుంచి భారత్ ఏవిధంగా న్యాయం పొందింది.? శత్రు మూకకు ఎటువంటి బదులు చెప్పింది.? దాయాది పాకిస్తాన్ ను భారత్ ఎలా కట్టడి చేసింది.? అనే అంశాల మీద ప్రతి ఒక్కరికి ఎన్నో సందేహాలు.

Also Read – జగన్‌ వార్ డిక్లేర్… ఇవిగో సాక్ష్యాలు!

అటు దాయాది పాకిస్తాన్ ఈ పోరులో భారత్ పై పాక్ ఆర్మీ విజయం సాధించింది అంటూ సంబరాలు చేసుకుంటుంది, ఇటు భారత ప్రభుత్వం కూడా పాక్ పై భారత్ విజయం సాధించింది అంటూ ప్రకటనలు చేస్తుంది.

అయితే ఈ ఉగ్రవాద పోరులో ఎవరు ఎవరి పై విజయం సాధించారు, ఇందులో ఎవరి మాటలు వాస్తవాలు అనేది ప్రపంచానికి తెలిసినా పాక్ మాత్రం తమదే గెలుపు అనే భ్రమలో తమ దేశ ప్రజలను ఉంచాలని ఆశపడుతోంది.

Also Read – కవిత సిగ్నల్స్.. కేసీఆర్‌ పట్టించుకోవట్లేదే!

పెహాల్గమ్ దాడి అనంతరం భారత్ ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలకు యావత్ దేశం మద్దతిచ్చింది. సింధు జలాల నిలిపివేత నుంచి పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలు తెంచుకోవడం, ఆపరేషన్ సింధూర్ వరకు మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి అటు అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాయి, కేంద్ర ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ను ప్రకటించాయి.

అయితే ఈనెల 10 వతేదీన అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ వినూత్నంగా భారత్ – పాక్ మధ్య ‘సీజ్ ఫైర్’ ఒప్పందం జరిగిందంటూ ప్రకటించి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచాయి. అయితే ఈ రెండు దాయాది దేశాల మధ్య వైట్ హౌస్ చేసిన మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయంటూ పోస్ట్ చేసారు ట్రంప్.

Also Read – అందుకు జగన్‌ని అభినందించాల్సిందే.. వారిపై జాలిపడాల్సిందే!

దీనితో అప్పటి వరకు దేశ భక్తితో ఒక్కటైనా భారతీయులంతా మోడీ నిశ్శబ్దాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అసలు దేశంలో ఎం జరుగుతుంది.? పాకిస్తాన్ పై భారత్ పట్టు బిగిస్తున్న ఈ తరుణంలో భారత్ ఎందుకు వెనకడుగు వేస్తుంది.? అంటూ కొందరు,

1971 నాటి ఉదంతాలు ఉదాహరణలు గా చూపుతూ ఆనాటి ప్రధాని ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, పాక్ పై చేసిన ప్రసంగాలు, ఇరు దేశాల అంతర్గత విషయాల మధ్య మరొకరి జోక్యం అనవసరమంటూ చేసిన ప్రస్తావనలు తీసుకువచ్చి మరికొందరు బీజేపీ పై మోడీ పై విమర్శలను గుప్పిస్తున్నారు.

పాకిస్తాన్ ఉగ్రవాదం భారత్ పై దాడి జరిపినప్పుడు పాకిస్తాన్ ను నిలువరించలేని పెద్ద మనుషులు ఇప్పుడు పాక్ పై భారత్ ప్రతిదాడి చేస్తుంటే మాత్రం మధ్యవర్తిత్వానికి వచ్చి పాక్ కు అండగా నిలుస్తారా.? దానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సహకరిస్తారా.? పాక్ జరిపిన డ్రోన్ల దాడులలో పదుల సంఖ్యలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

అలాగే భారత జవాన్లు దేశ రక్షణ కోసం పాక్ చర్యలతో వీర మరణం పొంది వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఇటువంటి హృదయ విదారక దృశ్యాలను చూసిన భారతమాత ఉగ్రవాదం కింద అణిగిమణిగి ఉండాలా.? అంటూ మోడీ పై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షమే కురుస్తుంది. అటు పెహల్గామ్ నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదుల సంగతేంటి అంటూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి మొదలయ్యింది.

అయితే గత పది రోజుల నుంచి దేశాన్ని కమ్మేసిన ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ. దేశంలో ఇంత జరుగుతున్నా మోడీ ఇంతవరకు మీడియా ముందుకొచ్చి ప్రజలను అడ్రెస్స్ చేసింది లేదు. త్రివిధ దళాధిపతులతో కీలక సమావేశాలు, అఖిలపక్ష సభ్యులతో భేటీలు అంటూ తెరవెనుకనే పనికానిస్తున్న మోడీ నేడు ప్రజలముందుకు రానున్నారు.




ఆపరేషన్ సింధూర్ తరువాత ఈ రోజు రాత్రి 8 గంటలకు దేశ ప్రధాని హోదాలో మీడియా ముందుకొస్తున్న నరేంద్ర మోడీ ఇటు దేశ ప్రజలను ఉద్దేశించి ఎం చెప్పబోతున్నారు, అటు దాయాది దేశమైన పాకిస్తాన్ కు ఎటువంటి హెచ్చరికలు పంపబోతున్నారు, అసలు కాల్పుల విరమణ వెనుక దాగిఉన్న వాస్తవాలేమిటి అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.